TTD ADDITIONAL EO DONATES FIVE INDIGENOUS COWS TO SV GOSAMRAKSHANA SHALA _ ఎస్వీ గోశాలకు 5 దేశీయ గోవులను విరాళంగా అందజేసిన టీటీడీ అదనపు ఈవో
CALLS FOR PROTECTING AND WORKSHIPPING GOMATA AS PART OF SANATANA DHARMA
Tirupati, October 14, 2026: TTD Additional Executive Officer Sri C.H. Venkaiah Chowdary said that Gomata holds a special place in Sanatana Dharma and called upon everyone to support cow protection.
On Wednesday, he donated five indigenous cows to the TTD SV Gosamrakshana Shala in Tirupati.
On the occasion, TTD priests performed special pujas to Sri Venugopala Swamy at the Gosamrakshana Shala, followed by Go Dhana puja. The Additional EO later offered fodder to the cows.
He said that worshipping the cow as a mother is an integral part of Sanatana tradition and that beginning auspicious occasions with Go Puja is considered sacred.
Later, he handed over the five cows to SV Gosamrakshana Shala Director Sri Sivakumar. He also inspected the facility and enquired about fodder supply, animal healthcare and general maintenance. He offered suggestions for better cow care and expressed satisfaction with the management of the Gosamrakshana Shala.
Gosamrakshana Shala Managers Dr. D. Nagaraju, Dr. T.V. Sudhakar and Dr. Balasubramanyam, along with Office Superintendent Sri Venkatadri, participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
గోమాతకు పూజ.. సనాతన ధర్మానికి గౌరవం
ఎస్వీ గోశాలకు 5 దేశీయ గోవులను విరాళంగా అందజేసిన టీటీడీ అదనపు ఈవో
తిరుపతి, అక్టోబరు 14, 2026: సనాతన ధర్మంలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ గోమాతను పూజించి గోసంరక్షణకు తమ వంతు కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.
తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలకు బుధవారం తమ స్వగ్రామంలోని ఇంటి నుండి 5 దేశీయ గోవులను తీసుకువచ్చి దానంగా అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు ముందుగా ఎస్వీ గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామికి పూజలు నిర్వహించిన తర్వాత గోదాన పూజ చేయించారు. ఆ తర్వాత అదనపు ఈవో గోవులకు దాణా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవును తల్లిగా భావించి పూజించడం మన సనాతన సంప్రదాయమని తెలిపారు. గోపూజతో శుభకార్యాలను ప్రారంభించడం శుభప్రదమని సనాతన ధర్మం చెబుతోందన్నారు.
అనంతరం 5 గోవులను ఎస్వీ గోశాల డైరెక్టర్ శ్రీ శివకుమార్కు అందజేశారు. గోశాలను సందర్శించిన అదనపు ఈవో గోవులకు అందిస్తున్న దాణా, వాటి ఆరోగ్య సంరక్షణ, నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోవుల సంరక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారు. గోశాల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోశాల మేనేజర్లు డా. డి. నాగరాజు, డా. టి.వి. సుధాకర్, డా. బాలసుబ్రహ్మణ్యం, ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి పాల్గొన్నారు.




