PRIORITY ACCORDED TO COMMON DEVOTEES IN SRIVARI DARSHAN _ శ్రీ‌వారి ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త‌

DEVOTEES EXPRESS CENT PERCENT SATISFACTION WITH DARSHAN ARRANGEMENTS

ABOUT 1.68 LAKH DEVOTEES HAD DARSHAN IN FIRST TWO OF THE ONGOING BRAHMOTSAVAMS

ACCOMMODATION PROVIDED TO COMMON DEVOTEES

Tirumala, 14 October 2026: To enable common devotees to have darshan of Sri Venkateswara Swamy during the Srivari Navaratri Brahmotsavams, TTD has cancelled slotted Sarva Darshan tokens, VIP break darshan and other privilege darshans meant for senior citizens, differently-abled persons, parents with infants, and NRIs resulting in cent percent satisfaction with the darshan arrangements, said Sri Bayyala Bhaskar, Deputy Executive Officer of the Srivari Temple.

Addressing a press conference at the Media Centre in Rambageecha-2, Tirumala, on Wednesday evening, he said that nearly 1.68 lakh devotees had darshan of Srivaru during the first two days of the Brahmotsavams, following the priority given to common devotees. 

He added that darshan was being facilitated smoothly for not less than 4,000 devotees every hour. In view of the heavy pilgrim rush, nine lakh laddus are being made available daily in buffer stock.

Priority in accommodation allotment

Sri Bhaskar who also heads accommodation said that priority was being accorded to common devotees in the allotment of accommodation in Tirumala during ongoing Brahmotsavams.

Nearly 4,000 rooms are being allotted daily to common devotees during the Brahmotsavam days, he said. 

The registration process had been expedited to enable devotees to obtain rooms without delay.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీ‌వారి ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధాన్య‌త‌

దర్శనాలపై 100 శాతం భక్తుల సంతృప్తి

శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ బ‌య్యాల భాస్క‌ర్

తిరుమ‌ల‌, 2026 అక్టోబ‌ర్ 14: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో అధిక‌మంది సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు స్లాటెడ్ స‌ర్వ ద‌ర్శ‌న టోకెన్లు, వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేయ‌డంతో స్వామివారి దర్శనాల్లో 100 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ బ‌య్యాల భాస్క‌ర్ చెప్పారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2లోని మీడియా సెంట‌ర్ లో బుధ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

శ్రీ‌వారి ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తులకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో దాదాపు 1.68 ల‌క్ష‌ల మంది భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకున్నార‌ని తెలిపారు. ఒక గంట‌కు నాలుగు వేల మంది భ‌క్తుల‌కు త‌గ్గ‌కుండా సౌక‌ర్య‌వంతంగా స్వామివారి ద‌ర్శ‌నాలు చేయిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. భ‌క్తుల ర‌ద్దీకి అనుగుణంగా రోజుకు 9 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను అందుబాటులో ఉంచామ‌ని చెప్పారు.

వ‌స‌తి కేటాయింపులో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద పీట‌

తిరుమ‌ల‌లోని వ‌స‌తి గ‌దుల కేటాయింపులో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేసిన‌ట్లు డిప్యూటీ ఈవో శ్రీ బ‌య్యాల భాస్క‌ర్ తెలియ‌జేశారు. బ్ర‌హ్మోత్స‌వ రోజుల్లో రోజుకు దాదాపు నాలుగు వేల గ‌దుల‌ను సామాన్య భ‌క్తుల‌కే కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. భ‌క్తులు త్వ‌రిత‌గ‌తిన గ‌దులు పొందేలా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశామ‌న్నారు. కాష‌న్ డిపాజిట్ రీఫండ్ ను 100 శాతం విజ‌య‌వంతంగా వెన‌క్కి ఇస్తున్నామ‌ని తెలిపారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తుల‌కు మాత్ర‌మే రీఫండ్ కాద‌ని తెలియ‌జేశారు.

ఈ కార్యక్ర‌మంలో టీటీడీ పీఆర్వో కుమారి నీలిమ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌డం జ‌రిగింది.