TTD AND JIO SIGN MoU FOR TECHNICAL SERVICES _ టీటీడీకి జియో సాంకేతిక సహకారం – టీటీడీ సేవలన్నీ ఓకే యాప్ లో – టీటీడీ – జియో ఎంఓయు

Tirumala, 08 October 2021: TTD signed an MoU with Jio on Friday for technical support to provide all TTD services under one app.

 

The MoU was signed at Annamaiah Bhavan by Additional EO Sri AV Dharma Reddy and Jio representative Sri Anish in the presence of TTD Chairman Sri YV Subba Reddy and the TTD EO Dr KS Jawahar Reddy.

 

Speaking on the occasion the TTD Chairman said during the Covid situation TTD servers faced technical snags when lakhs of devotees attempted at a time for online booking. Then Jio came for TTD support and facilitated the issue of Srivari Darshan tickets without any hassle to devotees.

 

Last month also use of cloud technology by Jio resolved online server issues. Thereafter Jio came forward to prepare a single app for all TTD services and sevas. This app facilitates online booking of accommodation; darshan etc. and the new app shall be launched on Vaikunta Ekadasi day upon their request.

 

He said since last five years TCS has also been providing free technical support to the TTD IT wing. With Jio adding the team, enhanced IT services shall be provided to devotees, he expressed.

 

Jio representatives Sri BC Singh, Sri Amar, Sri Duggar, K Bharati, TTD IT wing incharge Sri Sesha Reddy and CIO Sri Sandeep were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి జియో సాంకేతిక సహకారం
 
–  టీటీడీ సేవలన్నీ ఓకే యాప్ లో
 
– టీటీడీ – జియో ఎంఓయు
 
తిరుమల, 2021 అక్టోబ‌రు 08: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టిటిడికి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి టిటిడి- జియో  శుక్రవారం ఎంఓయు చేసుకున్నాయి.
 
తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్  శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి జియో ప్రతినిధి శ్రీ అనిష్ ఎంఓయుపై సంతకాలు చేశారు.   
 
అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ,  కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారన్నారు దీంతో టిటిడి సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఈ సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. గత నెలలో జియో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సర్వదర్శనం,  ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు గంటల లోపు టికెట్ల బుక్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
 
టిటిడికి సంబంధించిన అన్ని సేవలు,  సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారుచేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ యాప్ లో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి అన్ని సేవలు  అందుబాటులో ఉంటాయని శ్రీసుబ్బారెడ్డి చెప్పారు రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున  ఈ యాప్ ను  ఆవిష్కరించే  ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. గత ఐదేళ్లుగా టిటిడికి  ఉచితంగా సాంకేతిక  సహకారం అందిస్తున్న టిసిఎస్ సమన్వయంతో జియో సంస్థ ఉచితంగా టిటిడి ఐటి విభాగానికి మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. జియో సంస్థ ప్రతినిధులు శ్రీ బీపీ సింగ్ శ్రీ అమర్, శ్రీ దుగ్గల్ , కె.భారతి, టిటిడి ఐటి విభాగం HOD శ్రీ శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సందీప్  పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.