TTD BETTER ITS OWN VAIKUNTHA DWARA DARSHAN TIME RECORD _ వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 3.45 గంటలకు సర్వదర్శనం ప్రారంభం

COMMENCES COMMON PILGRIM DARSHAN BY 3:45AM

DEVOTEES ELATED WITH THE ARRANGEMENTS BY TTD

 CHAIRMAN COMPLIMENTS TTD STAFFS, POLICE AND VOLUNTEERS

Tirumala, 6 Jan. 20: TTD has bettered it’s own record by providing Vaikuntha Dwara Darshan to common pilgrims which has commenced one hours fifteen minutes before the scheduled time as promised by the temple management on the auspicious day of Vaikuntha Ekadasi on Monday.

The joy of devotees knew no bounds when the first pilgrim compartment in VQC was released at 3:45am on January 6. The elated devotees expressed their immense satisfaction over the darshan and other arrangements made by TTD for the sake of devotees to witness the Vaikuntha Dwara Darshan which went off in a smooth manner.

Disclosing the same to the media, TTD Trust Board Chairman Sri YV Subba Reddy said, the pilgrims have given a big thumbs up over the arrangements made by TTD in Vaikuntham Queue Complex, Narayanagiri Queue lines, Four Mada streets and above Vaikuntha Dwara Darshan, much before the scheduled time. Later he complimented the employees of all departments of TTD, Police, Srivari Sevaks, Scouts and above all, the pilgrims for making the most challenging day to move ahead in a peaceful manner.

Later, TTD Additional EO Sri AV Dharma Reddy said, we have commenced the Dwara Darshan for common pilgrims at 3.45am and a set a new record. The common man’s darshan has always been a top priority of TTD and we have done what we have promised to them by commencing the darshan 1hour 15 minutes before our scheduled time. I also thank the VIPs for extending their co-operation to the management in its efforts”, he maintained.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 3.45 గంటలకు సర్వదర్శనం ప్రారంభం

టిటిడి ఏర్పాట్ల‌పై భ‌క్తుల సంతృప్తి

శ్రీ‌వారి ఆల‌యంలో ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించిన టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో

 తిరుమల, 06 జ‌న‌వ‌రి 2020: తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమ‌వారం ఉదయం 3.45 గంటలకు సర్వదర్శనం ప్రారంభించడంతో సామాన్యభక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్దేశించిన స‌మ‌యానికి 1.15 గంట‌ల ముందుగానే సర్వదర్శనం ప్రారంభం కావ‌డంతో భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం భ‌క్తులు వైకుంఠ ద్వార ప్ర‌వేశం చేశారు. శ్రీవారి ఆలయం, బ‌య‌టి క్యూలైన్ల‌లో భక్తుల ఏర్పాట్లను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. ఏర్పాట్లపై పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్వదినం సందర్భంగా టిటిడి ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్ల‌లో చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై భ‌క్తులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిపారు. విశేషంగా విచ్చేసిన భ‌క్తులు ప్ర‌శాంతంగా ద‌ర్శ‌నం చేసుకునేందుకు కృషి చేసిన టిటిడిలోని అన్ని విభాగాల ఉద్యోగుల‌ను, పోలీసుల‌ను, శ్రీ‌వారి సేవ‌కుల‌ను, స్కౌట్స్‌ను అభినందించారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ సామాన్య భ‌క్తుల‌కు ఉద‌యం 3.45 గంట‌ల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప్రారంభించ‌డం రికార్డు అని తెలిపారు. ముందుగా హామీ ఇచ్చిన విధంగా 1.15 గంట‌ల ముందుగా స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభించ‌డం ద్వారా సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేశామ‌న్నారు. ఈ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా స‌హ‌క‌రించిన విఐపిల‌కు కృత‌జ్ఙ‌త‌లు తెలియజేశారు.

వైభవంగా స్వర్ణరథోత్సవం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమ‌వారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

శ్రీ‌వారి ఆల‌యంలో శోభాయ‌మానంగా పుష్పాలంకరణ

శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు.

ఆక‌ట్టుకున్న ద‌శావ‌తార వైభ‌వం, అష్ట‌ల‌క్ష్మీ సెట్టింగులు

శ్రీవారి ఆలయం వద్దగల వైభ‌వోత్స‌వ మండ‌పం ప‌క్క‌న‌ ద‌శావ‌తార వైభ‌వం, అష్ట‌ల‌క్ష్ముల సెట్టింగులు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూ.25 ల‌క్ష‌ల వ్య‌యంతో దాత స‌హ‌కారంతో దీన్ని ఏర్పాటుచేశారు.

జ‌న‌వ‌రి 7న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం

వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగ‌ళ‌వారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నానమహోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. కాగా వైకుంఠద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.