TTD BRINGS OUT READER FRIENDLY SRI MAHABHAGAVATHAM _ స‌ర‌ళ‌మైన భాష‌లో శ్రీ మ‌హాభాగ‌వ‌త‌ము గ్రంథం

·      12 SKANDAS IN 8 VOLUMES

 Tirupati, 28 September 2021: TTD has published Sri Mahabaghavatam penned by Sri Bammera Pothana in reader-friendly simple prose form in eight volumes comprising of 12 skandas and costing Rs.2700.

The epic literature is made available to all interested devotees at the TTD publication stalls in Tirumala, Tirupati and also at Tiruchanoor.

The holy book was drafted in simple Telugu by 33 pundits in 5696 pages with colourful illustrations by famed artist late Sri Bapu and is made available to readers in finely bound volumes.

The super edition could be procured by the devotees and institutions through posts, by sending a DD from any nationalized bank to “ EO, TTD, Tirupati “ with a covering letter addressed to “ OSD, publications wing, Press compound, KT Road, Tirupati”. The devotees can procure the volumes on payment of additional charges towards packing and postage (To Pay) system.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌ర‌ళ‌మైన భాష‌లో శ్రీ మ‌హాభాగ‌వ‌త‌ము గ్రంథం

8 సంపుటాల్లో 12 స్కంధాలు

టిటిడి పుస్త‌క విక్ర‌య‌శాల‌ల్లో భ‌క్తుల‌కు అందుబాటు

తిరుప‌తి, 2021, సెప్టెంబరు 28: శ్రీ బ‌మ్మెర పోత‌నామాత్యుడు రచించిన శ్రీ భాగవత‌ము స‌ర‌ళ వ్యాఖ్యాన స‌హితం గ్రంథాన్ని టిటిడి భ‌క్తులంద‌రికీ అందుబాటులోకి తెచ్చింది.

12 స్కంధాలతో కూడిన ఎనిమిది సంపుటాలు గల ఈ గ్రంథం ధరను రూ.2,700/-గా టిటిడి నిర్ణయించింది. తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో ఈ గ్రంథం భక్తులకు అందుబాటులో ఉంది. ప్రతిపదార్థ తాత్పర్యాలతో కూడిన సరళ వ్యాఖ్యానాన్ని 33 మంది ప్రసిద్ధ పండితులు రచించారు. దాదాపు 5,696 పేజీలు గల ఈ గ్రంథంలో కీ.శే బాపు వర్ణచిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చ‌క్క‌టి బైండింగ్‌లో పాఠ‌కులు సౌక‌ర్య‌వంతంగా చ‌దువుకునేలా ఈ గ్రంథాన్ని ముద్రించారు.

మొదటి సంపుటంలో 1, 2వ స్కంధాలున్నాయి. వీటికి ప్రధాన సంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు వ్యవహరించారు. డా|| కేశాప్రగడ సత్యనారాయణ, డా|| మల్లెల గురవయ్య, డా|| సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యానం అందించారు.

రెండవ సంపుటంలో 3వ స్కంధం ఉంది. ప్రధాన సంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు వ్యవహరించారు. డా|| కడిమిళ్ల వరప్రసాద్‌, డా|| కసిరెడ్డి వెంకటపతిరెడ్డి,  డా|| గల్లా చలపతి వ్యాఖ్యానం చేశారు.

మూడవ సంపుటంలో 4, 5వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యాతలుగా డా|| దావులూరి క ష్ణమూర్తి, డా|| ఆర్‌.అనంతపద్మనాభరావు, డా|| శలాక రఘునాథశర్మ, డా|| కె.సర్వోత్తమరావు వ్యవహరించారు.

నాలుగో సంపుటంలో 6, 7వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య వ్యవహరించారు. డా|| జోస్యుల సూర్యప్రకాషరావు, డా|| కొంపిల్ల రామసూర్య నారాయణ, శ్రీ కోట వేంకటలక్ష్మీనరసింహం, డా|| ఆకురాతి పున్నారావు, డా|| ఆకెళ్ల విభీషణశర్మ వ్యాఖ్యానం అందించారు.

ఐదో సంపుటంలో 8, 9వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యాతలుగా డా|| హెచ్‌ఎస్‌.బ్రహ్మానంద, డా|| వైద్యం వేంకటేశ్వరాచార్యులు, డా|| డి.మీరాస్వామి, శ్రీ కోట వేంకటలక్ష్మీనరసింహం వ్యవహరించారు.

ఆరో సంపుటంలో 10వ స్కంధం పూర్వభాగం ఉంది. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య వ్యవహరించారు. డా|| అప్పజోడు వేంకటసుబ్బయ్య, డా|| ఏఎస్‌.గోపాలరావు, శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ, డా|| పి.నరసింహారెడ్డి, విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, డా|| పిఆర్‌.హరినాథ్‌ వ్యాఖ్యానం అందించారు.

ఏడో సంపుటంలో 10వ స్కంధం ఉత్తర భాగం ఉంది. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యాతలుగా డా|| నాగళ్ల గురుప్రసాదరావు, డా|| ఎన్‌విఎస్‌.రామారావు, డా|| కె.మలయవాసిని, డా|| కె.జె.క ష్ణమూర్తి, డా|| సంగనభట్ల నరసయ్య వ్యవహరించారు.

ఎనిమిదో సంపుటంలో 11, 12వ స్కంధాలున్నాయి. ప్రధాన సంపాదకులు డా|| సముద్రాల లక్ష్మణయ్య కాగా, వ్యాఖ్యానం డా|| గల్లా చలపతి అందించారు.

పోస్టు ద్వారా గ్రంథం కావాలంటే…:

శ్రీ మ‌హాభాగ‌వ‌త‌ము గ్రంథాన్ని పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ”ప్ర‌త్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ప్యాకింగ్ చార్జీలు అద‌నం. టు పే విధానం(పోస్టల్‌ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు ఈ గ్రంథాలను పంపడం జరుగుతుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.