TTD CALL CENTRE SHOULD FUNCTION MORE EFFECTIVELY-TTD EO_ కాల్‌సెంటర్ ద్వారా భక్తులకు మరింత వేగవంతంగా సమాచారం అందించాలి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirupati, 17 November 2017:While appreciating the services of TTD call centre staffs 24X7, the TTD EO Sri Anil Kumar Singhal directed the officials concerned who are supervising the call centre activity to ensure more effectiveness in disseminating information to pilgrims.
A review meeting on Call Centre activity was held in the chambers of TTD EO in the administrative building on Friday evening along with JEO Tirupati Sri P Bhaskar and CVSO Sri A Ravikrishna. The EO directed the JEO to see that one staff is exclusively given the responsibility of viewing complaints from pilgrims on watsapp and also in e-mails. “At the end of the day, the complaints which were received on some core issues by the Call Centre should mailed to EO, JEOs and PRO without fail”, he added.
Later he instructed the IT wing Chief Sri Sesha Reddy to to make necessary amendments in the existing application to effectively redress the pilgrim complaints. “The PRO should update call centre staff every day on daily developments in pilgrim perspective so that there will not be any communication gap while informing the pilgrims. When the pilgrim is on call waiting they should get useful information about TTD during that time”, he added.
CE Sri Chandra Sekhar Reddy, PRO Dr T Ravi, HCL Manager Sri Sai Krishna were also present.
EO INSPECTS CALL CENTRE
TTD EO Sri Anil Kumar Singhal along with Tirupati JEO Sri P Bhaskar and CVSO Sri A Ravikrishna inspected the TTD Call Centre which operates 24X7. He also directed the CE Sri Chandra Sekhar Reddy to make necessary improvements in the call centre.
ISSUED BY TTDs,PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కాల్‌సెంటర్ ద్వారా భక్తులకు మరింత వేగవంతంగా సమాచారం అందించాలి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుపతి,17నవంబరు 2017;టిటిడి కాల్‌సెంటర్ ద్వారా భక్తులకు మరింత వేగవంతంగా సమాచారం అందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాల్‌సెంటర్‌ను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాట్సాప్, ఈ మెయిల్స్ ద్వారా భక్తులు వ్యక్తం చేస్తున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేయడానికి, ఆయా విభాగాల అధికారులు దృష్టికి తీసుకు వెళ్లెందుకు కాంటర్‌లో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యాలు, సేవలకు సంబంధించి మరింత వేగవంతంగా సమాచారం అందించేందుకు, టిటిడిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులపై కాల్‌సెంటర్ సిబ్బందికి అవగాహన కల్పించాలని టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవిని ఆదేశించారు.
టిటిడి వెబ్‌సైట్, ఎస్వీబిసి, ఇతర ప్రచార మాద్యమాల ద్వారా సమాచారాన్ని పంపడం ద్వారా భక్తులకు తాజా సమాచారాన్ని అందిచవచ్చని సూచించారు. అదేవిధంగా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన సమయంలో కాల్ వెయిటింగ్ వున్నప్పుడు టిటిడి సమాచారాన్ని, తిరుమలలో భక్తులు చేయవలసినవి, చేయకుడనివి అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి రోజు విభాగాల వారిగా అందుతున్న సూచనలు, ఫిర్యాదులను విభజించి సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కాల్‌సెంటర్ ద్వారా అందుతున్న భక్తుల సమస్యలను నేరుగా ఈవో, తిరుమల జెఈవో, తిరుపతి జెఈవో, పిఆర్‌వోలకు పంపించాలని ఆదేశించారు.
అంతకుముందు తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కాల్‌సెంటర్‌ను ఈవో, తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాల్‌సెంటర్ పనితీరును అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం కాల్‌సెంటర్ సిబ్బంది భక్తులకు అందిస్తున్న సేవలని ఈవో అభినందించారు.
ఈ సమావేశంలో సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, హెచ్‌సిఎల్ మెనేజర్ శ్రీ సాయికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.