PADMAVATHI AS “YOGA NARAYANI” BLESSES DEVOTEES_ సింహ వాహనంపై శ్రీ మ‌హాల‌క్ష్మి

Tiruchanur, 17 November 2017: Sarva Swatantra Veera Lakshmi, Goddess Padmavathi Devi took a celestial ride on the ferocious Simha Vahanam as “Yoga Narayani” on Friday evening.

When Lord Maha Vishnu donned the ferocious Narasimha Avatar, he was pacified by Goddess as “Chenchu Lakshmi”-the tribal princess. He later did penance and taught yogic principles becoming Yoga Narasimha. Now the Goddess as “Yoga Narayani” sitting in the meditative posture blessed Her devotees.

The devotees were enthralled to see Goddess as “Yoga Narayana Murthy” on Simha Vahanam.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ వాహనంపై శ్రీ మ‌హాల‌క్ష్మి

తిరుపతి‌, 17 నవంబ‌రు 2017; శుక్ర‌వారం రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది.

శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌డ‌మైన‌ది.