TTD CANCELS CATEGORISATION IN VIP BREAK DARSHANS WITH IMMEDIATE EFFECT_ నేటి నుండి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల‌ను ర‌ద్దు చేస్తున్నాం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

APPLICATION TO BE DEVELOPED IN COUPLE OF DAYS-TTD CHAIRMAN

Tirumala, 17 Jul. 19: In a big move, TTD has cancelled categorization in VIP Break Darshan tickets with immediate effect, said TTD Trust Board Chief Sri YV Subba Reddy.

The Chairman of TTD Board of Trustees, along with TTD EO Sri Anil Kumar Singhal and Tirumala SO Sri AV Dharma Reddy held a press conference at Annamaiah Bhavan in Tirumala on Wednesday.

The Chairman said, under the instructions of Honourable Chief Minister Sri YS Jagan Mohan Reddy who directed to give priority to common pilgrims by providing them more darshan time, ensuring hassle-free darshan, the decision to cancel L1, L2 an L3 darshans has been implemented from Wednesday itself. However, the Chairman said, since it may take a couple of days to develop the new software, the new system of VIP break darshan will come into effect in the next two days.

The Chairman also cleared that because of this decision, there will be no problem to protocol VIPs. But at present, the over three hours are being consumed for VIP break darshan only. This will be reduced to half of the time in a phased manner”, he added.

Over the alleged controversy fuming around Chairman Camp Office at Amaravathi, clearing the air, Sri YV Subba Reddy said that when a temple of TTD is coming up at the state capital there is every need to have an Information Centre of TTD. “We have Information Centres at all the main cities like Hyderabad, Vijayawada, Chennai, Bengaluru, New Delhi, Mumbai, etc. Then I felt the need to have one at Capital City also and it is not for my Camp Office”, he clarified again.

Over Sannidhi Golla issue also, the Chairman said, the hereditary rights of Sannidhi Golla will be protected as per the tradition of the Tirumala temple.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నేటి నుండి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల‌ను ర‌ద్దు చేస్తున్నాం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల, 2019 జూలై 17: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే ప్ర‌ముఖులకు కేటాయించే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నంలో ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల‌ను జూలై 17వ తేదీ బుధ‌వారం నుండి ర‌ద్దు చేస్తున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ..శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌లకు విచ్చేసే ఎక్కువ మంది సామాన్య భ‌క్తుల‌కు మ‌రింత సౌక‌ర్యావంతంగా, సుల‌భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనంలో ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల‌ను ఈ రోజు నుండి రద్దు చేస్తున్నామ‌న్నారు. రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్‌డేట్ చేసిన అనంతరం ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల ర‌ద్దును అమలులోకి తీసుకువస్తామ‌న్నారు. ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌స్తుతం విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు 3 గంట‌లకు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని, దీనిని అంచెలంచెలుగా త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. అదేవిదంగా ఆల‌య సాంప్ర‌దాయం ప్ర‌కారం స‌న్నిధి గొల్ల వంశ‌పార‌ప‌ర్యంగా నియ‌మించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున‌ట్లు తెలిపారు.

చెన్నై, బెంగుళూరు, న్యూ ఢిల్లీ, ముంబాయి త‌దిత‌ర ప‌ట్ట‌ణాల‌లో స‌మాచార కేంద్రాలు ఏర్పాటు చేసిన విధంగానే న‌వ్యాంధ్ర నూత‌న రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయ‌వ‌ల‌సిందిగా అధికారులకు సూచించామ‌న్నారు. టిటిడి కార్యాల‌యం విజ‌య‌వాడ‌లో ఉన్నందున్న‌, అమ‌రావ‌తిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నందున ఇక్క‌డ కూడా స‌మాచార కేంద్రం ఏర్పాటు చేయాలని కోరిన‌ట్లు తెలిపారు. ఇదివ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌రాష్ట్ర‌ రాజ‌ధాని హైద‌రాబాదులో టిటిడి కార్యాల‌యం, స‌మాచార‌కేంద్రం ఉన్నవిధంగా అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయాల‌న్నారు. అంతేగాని ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయ‌వ‌ల‌సిందింగా కోరలేద‌ని వివ‌రించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.