TTD CANCELS SRINIVASA KALYANAM IN HYDERABAD ON FEB 17_ ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో శ్రీనివాస కల్యాణం రద్దు

Tirupati, 7 January 2019: TTD has cancelled Srinivasa Kalyanam to be performed at LB Stadium in Hyderabad on February 17 following the deviation of rules by organizers of the celestial event.

In October last, under the Organizer Category, Sri Dattagiri Maharaj Charitable Trust has come forward to perform this religious event in Hyderabad. But the Srinivasa Kalyanam which was to be observed on October 28 was postponed to February 17 this year.

At this juncture, in the name of Secretary of Sri Srinivasa Kalyanam Trust (under Reg.No.BK 4, CS No.418/2018) Sri B Krishnam Raju, handouts and pamphlets learnt to have distributed among devotees stating that those who offer donation for this religious wedding will be provided VIP Break Darshan (L1), Vastram of Lord and Goddess and will be seated on the stage where the celestial Srinivasa Kalyanam will be performed to deities.

As this is completely against the norms, it has been decided by TTD to cancel Srinivasa Kalyanam at LB Stadium in Hyderabad on February 17. TTD never accepts any donations for these weddings and has nothing to do with the donations which were collected by the Sri Srinivasa KalyanamTrust from devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో శ్రీనివాస కల్యాణం రద్దు

జనవరి 07, తిరుపతి 2019: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో జరగాల్సిన శ్రీనివాస కల్యాణాన్ని టిటిడి రద్దు చేసింది.

టిటిడి 2018, అక్టోబరు 28న ఆర్గనైజర్‌ కేటగిరి కింద శ్రీ దత్తగిరి మహరాజ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తరువాత స్వామివారి కల్యాణం ఫిబ్రవరి 17వ తేదీకి వాయిదా పడింది. ఈ క్రమంలో భక్తుల నుండి విరాళాలను ఆహ్వానిస్తూ శ్రీ శ్రీనివాస కల్యాణం ట్రస్టు(రిజిస్టర్‌ నం. బికె.4 సిఎస్‌ నెం.418/2018) కార్యదర్శి శ్రీ బి.కృష్ణంరాజు పేరుతో కరపత్రాలు, లేఖలను ముద్రించడం టిటిడి దృష్టికి వచ్చింది. విరాళాలందించినవారికి తిరుమలలో ఎల్‌1 దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి వస్త్రం, పట్టు పంచ అందిస్తామని కరపత్రాల్లో పేర్కొన్నారు. దాతలందరినీ కల్యాణం జరిగే వేదికపై కూర్చోబెడతామని కూడా తెలిపారు.

శ్రీనివాస కల్యాణం నిబంధనలను సదరు ఆర్గనైజరు అతిక్రమించడంతో ఫిబ్రవరి 17న కల్యాణాన్ని టిటిడి రద్దు చేసింది. శ్రీనివాస కల్యాణాల సందర్భంగా భక్తుల నుండి ఎలాంటి విరాళాలు స్వీకరించడం లేదని టిటిడి ఈ సందర్భంగా స్పష్టం చేసింది. శ్రీనివాస కల్యాణం ట్రస్టుకు భక్తులు అందించే విరాళాలతో టిటిడికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.