TTD CHAIRMAN AND THE EO INAUGURATE GREEN GARDENS IN VAIKUNTA QUEUE COMPLEX _ ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగించేలా తిరుమల పార్కుల అభివృద్ధి
Tirumala,23 September 2022: One more green gardens and with breath refreshing ambience has been created for devotees to divine experience in the hill town of Tirumala.
TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO Sri AV Dharma Reddy on Friday inaugurated a mix of 1.5-acre green carpet, avenue plantation, seasonal flowers, 1500 hanging pots in the Vaikuntham Queue Complex area.
Among others, the garden space included a 15 feet Krishna idol, 20 feet marble Govinda Namam, Shanku and Chakra icons, 40 feet Sri Venkateswara Padalu and white roses, three pairs of Gomata and calf, one-hour flute music which looped 24x 7, music stereo system all carefully put together and strongly protected with firm iron fencing.
Speaking on the occasion the TTD Chairman said the entire component of music, idols, green carpets, Hanging pots are expected to provide a unique visual treat to devotees waiting for hours and soothe their nerves.
The project was conceptualised, designed and executed in just 60 days. The project was implemented By Laurence Labs and Sneha Nursery for TTD.
Sri V V Ravi Kumar CFO of Laurence Labs and Sri L Narender Rao MD of Sneha Nursery who participated in the event said they were happy to contribute to TTD for devotees sake.
SE 2 Sri Jagadeeshwar Reddy, EEs Sri Jaganmohan Reddy, Sri Srihari, DE Ravishankar Reddy, Garden Deputy Director Sri Srinivasulu were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగించేలా తిరుమల పార్కుల అభివృద్ధి
– వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 పార్కును ప్రారంభించిన టీటీడీ చైర్మన్
తిరుమల 23 సెప్టెంబరు 2022: తిరుమలలో భక్తులు అడుగుపెడుతూనే వారికి ఆధ్యాత్మిక ఆహ్లాదం కలిగేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చెప్పారు .
మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఆనుకుని పునర్నిర్మించిన పార్కును చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తో కలసి శుక్రవారం ప్రారంభించారు .
ఈ సందర్బంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు . ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు . తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించి పక్కాగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు . అలాగే దాతల సహకారంతో పార్కులన్నీ పెద్ద ఎత్తున పునర్నిర్మిస్తున్నామని , దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ మరింతగా జరుగుతుందన్నారు . అలాగే తిరుమలకు 50 విద్యుత్ బస్సులు నడిపేలా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఆర్టీసీ కి బస్సులు అందే ఏర్పాటు చేశారని చైర్మన్ తెలిపారు . ఇందులో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీ 10 విద్యుత్ బస్సులను సి ఎం ప్రారంభిస్తారని వివరించారు . 27వ తేదీ తిరుపతిలో కరకం బాడి వైపునుంచి నుంచి వాసవి భవన్ వరకు నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారన్నారు . బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి 28వ తేదీ ఉదయం నూతన పరకామణి భవనం ప్రారంభిస్తారని చైర్మన్ తెలిపారు . రెండున్నరేళ్ల తరువాత భక్తుల మధ్యన స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నందువల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు . ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు .
పార్కు పునర్నిర్మాణ దాత హైదరాబాద్ కు చెందిన శ్రీ రవికుమార్ , ఆయన కుటుంబ సభ్యులు , సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ , చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు , ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి , గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ , విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు .
పార్కుల పరిశీలన అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తిరుమలలో నారాయణగిరి , స్పెషల్ టైప్ ,
జిఎన్ సి , గీతాపార్కు , శ్రీ పద్మావతి అథితి గృహం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది