TTD CHAIRMAN AND TTD EO EXTEND DASARA GREETINGS _ టిటిడి ఛైర్మన్‌, ఈవో ద‌స‌రా శుభాకాంక్షలు

TIRUMALA, 14 October 2021: TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Dr KS Jawahar Reddy have on Thursday evening extended Dasara greetings to devotees and TTD employees.

In a statement they wished health, wealth, and prosperity for all and said the path of dharma alone and the message of Vijay Dashami was they Dharma and righteous path will always led to success and peace.

They together appealed to devotees and TTD employees TTD seek blessings of Sri Venkateswara and chose right path.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ఛైర్మన్‌, ఈవో ద‌స‌రా శుభాకాంక్షలు

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 14: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి శ్రీవారి భక్తులకు, టిటిడి ఉద్యోగుల‌కు గురువారం ఒక ప్రకటనలో ద‌స‌రా శుభాకాంక్షలు తెలియజేశారు.

మంచికి, ధ‌ర్మానికే అంతిమ విజ‌యం లభిస్తుందని విజ‌య‌ద‌శ‌మి మానవాళికి సందేశం ఇస్తోందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యం గా, ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

ప్రజలందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఛైర్మన్‌, ఈవో కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.