TTD CHAIRMAN INSPECTS QUEUE LINES_ శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు – సర్వదర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirumala, 28 Sep. 18: As Tirumala has been witnessing unprecedented rush from the past few days, in connection with Peratasi month, TTD Trust Board Chief Sri Putta Sudhakar Yadav on Friday inspected the queue lines and other places along with concerned officers.

The Chairman visited VQC Annaprasadam, aged and physically challenged pilgrims waiting hall, Narayanagiri Queue lines, CRO, Lab, Parakamani Seva Hall, Kalyanakatta and monitored the services being rendered to the pilgrims in the respective places.

In the aged and physically challenged pilgrims waiting hall, he interacted with some devotees who expressed immense satisfaction over the arrangements made by TTD. Sri Vijay Khanna from Faridabad of Haryana appreciated the facilities being provided by TTD. Smt Vijaya Raman from Chennai while lauding the arrangements suggested to place a phone in the hall for their convenience to contact their kin whenever need arises.

Later speaking to media persons, the Chairman said, as Peratasi month happens to be auspicious to Tamil people, scores of devotees from Tamil Nadu thronged Tirumala and the queue lines have stretched over three kilo meters outside. “The Annaprasadam and water distribution are underway in a continuous manner and the vigilance sleuths are manning the pilgrim crowd in an organised manner. He said TTD has made elaborate arrangements for different categories of pilgrims to have hassle free darshan in spite of heavy rush. He said”, he added.

SE II Sri Ramachandra Reddy, Health Officer Dr Sermista, AVSO Sri Gangaraju were also present during inspection.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు – సర్వదర్శనం క్యూలైన్లను తణిఖీ చేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

సెప్టెంబరు 28, తిరుమల 2018: తమిళులకు ముఖ్యమైన పెరటాశి నెల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, వేగంగా, నాణ్యతతో సేవలందించాలని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం టిటిడి ఛైర్మన్‌, అధికారులతో కలిసి తిరుమలలోని నారాయణగిరి ఉద్యాణవనంలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు, విక్యూసి-2లోని అన్నప్రసాదాల తయారీ కేంద్రం, వృద్దులు, దివ్యాంగుల నూతన షెడ్డును, సిఆర్‌వో, తాగునీరు మరియు ఆహార పదార్థల నాణ్యత పరిశోదన కేంద్రం, పరకామణి సేవకుల వసతి భవనాన్ని, ప్రధాన కళ్యాణకట్టను తణిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ పెరటాశి నెల, దసర సెలవులు, శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులు శని, ఆది వారాలలో వేలాదిగా తరలివస్తున్నారని, వీరికి శ్రీవారి దర్శనం దాదాపు 20 గంటల సమయం పడుతుందని వివరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది వారాలలో విఐపి బ్రేక్‌ దర్శనాన్ని పరిమిత సంఖ్యలో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. తద్వారా సామాన్య భక్తులు ఎక్కువమంది శ్రీవారిని దర్శించుకుంటారని తెలియచేశారు. అదేవిధంగా భక్తుల కోరిక మేరకు త్వరలో అలిపిరి నడక మార్గంలోని నామాల గాలి గోపురం, 7వ మైలు వద్ద అన్నప్రసాదాలు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

అంతకుముందు ఛైర్మన్‌ అధికారులతో కలిసి విక్యూసి-2లోని వంటశాలను, అక్కడ నిల్వ వుంచిన ముడిసరుకులు, కూరగాయల నాణ్యతను, మిల్క్‌ బాయిలర్‌ను పరిశీలించారు. అనంతరం వయో వృద్దులు, దివ్యాంగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్డును పరిశీలించి, వారికి టిటిడి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైన్నైకి చెందిన శ్రీమతి విజయరామన్‌ వయో వృద్దుల షెడ్డులో ఫోన్‌ సౌకర్యాం కల్పించవలసిందిగా కోరగా, ఛైర్మన్‌ ఫోన్‌ ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అదికారులను ఆదేశించారు. హర్యాన రాష్ట్రం ఫరిదాబాదుకు చెందిన శ్రీ విజయ్‌ఖన్నా టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, నూతనంగా నిర్మించిన షెడ్డుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అదేవిధంగా నారాయణగిరి క్యూ లైన్లలోని భక్తులకు శ్రీవారిసేవకులు అందిస్తున్న అన్నప్రసాదాలు, అల్పాహరం, తాగునీరు, పాలు, మజ్జిగను పరిశీలించారు. కూలైన్లలో భక్తుల చేతిలో నుండి క్రింద పడిన అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు శుభ్రంచేయాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలో భక్తులు నడిచే మార్గంలో, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో భక్తులు కుర్చునేందుకు వీలుగా గ్రానైట్‌ బండలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

సిఆర్‌వోలో భక్తులు గదుల కొరకు కౌంటర్ల వద్ద ఆధార్‌ కార్డుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోను ప్రక్రియను పరిశీలించారు. భక్తులు వేచివుండే సమయం తగ్గించి త్వరతగతిన గదులు కేటాయించాలని వసతి విభాగం అధికారులను ఆదేశించారు. అనంతరం నీరు మరియు అహార పదార్థల నాణ్యత పరిశోదన కేంద్రంలో తాగునీరు, పాలు, నెయ్యి, నూనెలు, పప్పు దినుసులు, ఇతర అహార పదార్థల నాణ్యతను ఎలా పరిశీలిస్తారో ఆరోగ్య విభాగం అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అదేేవిధంగా పరకామణి సేవకుల పసతి భవనాన్ని ఛైర్మన్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా టిటిడి ప్రజా సంబంధాల అధికారి డా|| టి.రవి పరకామణి సేవకులు తిరుమలలోని శ్రీవారి ఆలయం, తిరుపతిలోని నాణ్యల పరకామణిలోను సేవలందిస్తున్నారని వివరించారు.

ప్రధాన కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పణకు సౌకర్యవంతంగా ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలను పరిశీలించారు. అనంతరం ఛైర్మన్‌ భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కుర్చుని తలనీలాలు సమర్పిచడంపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. టిటిడి అందిస్తున్న సౌకర్యాలు, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కుర్చుని తలనీలాలు సమర్పించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రధాన కల్యాణకట్ట వద్ద ఉన్న అఖండనామ సంకీర్తన వేదికను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆరోగ్య విభాగం అధికారి డా|| శర్మిష్ఠ, కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర అదికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.