TTD CHAIRMAN OFFERS VASTRAMS TO KANCHI VARADARAJA SWAMY AND KAMAKSHI TEMPLES_ కాంచీపురంలోని శ్రీ వరదరాజస్వామి, శ్రీ కామాక్షి అమ్మవార్లకు టిటిడి ఛైర్మన్ పట్టువస్రాలు సమర్పణ
Tirumala, 16 Jul. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy presented silk vastrams to Sri Varadaraja Perumal at Kanchipuram in Tamilnadu as a part of the going 40-year once rare spectacle-Atti Varadar on Tuesday.
On his arrival to the temple, he was given warm reception by Collector Sri Ponnaiah, SP Sri Kannan and temple EO Sri Tyagarajar.
Afterward, the Chairman also had darshan of Sri Kamakshi at Kanchipuram. He also presented silk vastrams to Kamakshi Amman. He was welcomed by the temple manager Sri Srikaryan.
Peishkar Sri Lokanatham, PS to Chairman Sri Chowdary were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కాంచీపురంలోని శ్రీ వరదరాజస్వామి, శ్రీ కామాక్షి అమ్మవార్లకు టిటిడి ఛైర్మన్ పట్టువస్రాలు సమర్పణ
తిరుమల, 2019 జూలై 16: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాంచీపురంలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అత్తి వరదరాజస్వామివారి వేడుకలను పురస్కరించుకుని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మన్‌కు జిల్లా కలెక్టర్ శ్రీ పొన్నయ్య, ఎస్‌పి శ్రీ కన్నన్, ఆలయ ఈవో శ్రీ త్యాగరాజర్ ఘనంగా స్వాగతం పలికారు.
ఆ తరువాత కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారిని ఛైర్మన్ దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ మేనేజర్ శ్రీ శ్రీకార్యన్ టిటిడి ఛైర్మన్‌కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ లోకనాథం, ఛైర్మన్ పిఎస్ శ్రీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.