TTD CHAIRMAN RELEASES WHITE PAPER ON SRIVANI TRUST FUNDS _ శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి 

TIRUMALA, 23 JUNE 2023: TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with the TTD EO Sri AV Dharma Reddy released white paper on Sri Venkateswara Alayana Nirmana Trust (SRIVANI).

 

During the media conference held at Annamaiah Bhavan in Tirumala on Friday, the Chairman briefed the media on SRIVANI and said as per TTD Board Res. No.388 the Trust was established on August 28 in 2018 with the main objective to support the restoration of old temples and the Construction of new temples or Bhajanamandirams(small temples), as part of Sanatana Hindu Dharma Prachara.

 

However, the real activity of the Trust commenced after the TTD Board in its Resolution No.23 on September 23 in 2019 has approved to extend the privilege of one-time VIP Break Darshan to the donor on donating Rs.10,000/- to SRIVANI Trust. The funds started pouring in for the noble cause taken up by TTD to construct temples in SC, ST, BC and fishermen colonies. Since its inception till May 31 this year, so far over 860crores have been donated to SRIVANI by devotees both in online and offline and over 8.25lakh devotees availed the darshan of Sri Venkateswara Swamy. 

 

 

Elaborating further he said the financial assistance so far has been sanctioned at Rs. 93 crores for 176 Endowment and Private temples under SRIVANI Trust for restoration of old temples. We have also resolved to take the construction of 2273 temples in backward areas allotting Rs.10lakhs for each temple out of which 1953 are taken up by AP Endowments Department and 320 by the Samarasata Seva Foundation. 

 

“In a transparent manner, we are running the administration and as part of it we have already released a white paper on TTD Properties, Gold Deposits, Fixed Deposits and today on the utilization of SRIVANI Trust funds. We are ready to clear the doubts regarding the usage of SRIVANI funds. I appeal to devotees not to fall in the trap of such baseless allegations made by some vested interests regarding the misuse of SRIVANI funds. We are reiterating and asserting that every single paisa donated by the devotee for the Trust is being utilized in the restoration of old temples and constructing new temples”, he added.

 

Speaking to the media, the EO said, when some Peethadhipathis and VHP leaders met him regarding the SRIVANI Trust funds issue, all the documents, bank accounts, balance amount details etc.were shown to them and even the VHP Central Committee Joint Secretary Sri Raghavulu expressed his satisfaction over the proper utilisation of funds by TTD. “Before making baseless allegations, one should verify the facts as the sentiments of millions of devotees are involved in this. We will proceed legally against those in the larger interests of devotees and the reputation of the institution, he added.

 

ISSUED BY PRO TTD TIRUPATI(THE DETAILS OF BANK ACCOUNTS, TEMPLES ETC.ARE ENCLOSED HEREWITH)

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
 
తిరుమల, 2023 జూన్‌ 23: శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) నిధులపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ టీటీడీ బోర్డు తీర్మానం నం.388 ప్రకారం సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా పురాతన దేవాలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాలు, చిన్న ఆలయాల(భజనమందిరాలు) నిర్మాణానికి తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో 2018 ఆగస్టు 28న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైందన్నారు. అదేవిధంగా, 2019 సెప్టెంబర్‌ 23న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ.10,000/- విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్‌ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. అప్పటినుండి ట్రస్టు వాస్తవ కార్యాచరణ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి గాను టీటీడీ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి నిధులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మే 31వ తేదీ వరకు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో భక్తులు శ్రీవారికి రూ.860 కోట్లకు పైగా విరాళాలు అందించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.93 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని, వీటిలో 1953 ఆలయాలను ఎపి దేవాదాయ శాఖ, 320 ఆలయాలను సమరసత సేవ ఫౌండేషన్‌ నిర్మిస్తాయని వివరించారు. 
 
టీటీడీ పరిపాలన పూర్తి పారదర్శకంగా నడుస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఆస్తులు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేశామని ఛైర్మన్‌ చెప్పారు. 
ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల వినియోగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. శ్రీవాణి నిధుల వినియోగంపై సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ నిధులను పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు వినియోగిస్తున్నామని పునరుద్ఘాటించారు.
 
ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు నిధుల వ్యవహారంపై కొందరు పీఠాధిపతులు, వీహెచ్‌పీ నేతలు తనను కలిసినప్పుడు అన్ని పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్‌ మొత్తం వివరాలు చూపానన్నారు. ఈ వివరాలపై విశ్వహిందూ పరిషత్‌ సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు శ్రీ రాఘవులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసే ముందు లక్షలాది మంది భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకోవాలని, ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.