TTD CHAIRMAN VISITS LEOPARD ATTACKED CHILD _ గాయపడిన బాలుడిని పరామర్శించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

KAUSHIK SAFE WITH SRIVARI BLESSINGS

Tirupati, 22 June 2023: TTD Chairman Sri YV Subba Reddy visited the child Chi.Kaushik who survived in the recent leopard attack and undergoing treatment in a TTD-run hospital in Tirupati.

A three-year-old child, Chi. Kaushik from Adoni in Kurnool district was treated at Sri Padmavati Children’s Hospital after he suffered injuries on Thursday night following a leopard attack on the Alipiri footpath near the seventh mile. 

Speaking after his interaction with the injured boy at the hospital TTD chairman said TTD will immediately take up fencing of the Alipiri and Srivari Mettu footpaths on both sides to ensure such incidents do not occur again.

TTD officials and doctors of the hospital were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి అనుగ్రహంతో కౌశిక్ క్షేమం

– గాయపడిన బాలుడిని పరామర్శించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి, 2023 జూన్ 23: తిరుమల శ్రీవారి అనుగ్రహం వల్లే అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి నుండి బాలుడు కౌశిక్ క్షేమంగా బయట పడ్డాడని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఐసియులో చికిత్స పొందుతున్న బాలుడిని శుక్రవారం చైర్మన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భక్తులు గురువారం రాత్రి అలిపిరి నడక మార్గంలో
శ్రీవారి దర్శనార్థం నడిచి వెళ్తుండగా చిరుత 3 సంవత్సరాల కౌశిక్ ను గాయపరిచి తీసుకువెళ్లిందన్నారు. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారు బాలుడి ప్రాణాలు కాపాడారని చెప్పారు. బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని, క్షేమంగా ఉన్నాడని మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా రెండు వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు . రాత్రి పూట రెండు నడక మార్గాల్లో భక్తులను నిలిపి వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని వివరించారు.

ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.