TTD CHAIRMAN TAKES PART IN NAVAGRAHA SHANTI HOMAM _ ప్ర‌పంచ శాంతి కొర‌కు నవగ్రహ శాంతి హోమము – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై,వి.సుబ్బారెడ్డి

Tirumala, 1 May 20: The Chairman of TTD Trust Board Sri YV Subba Reddy along with his spouse Smt YV Swarnalatha Reddy took part in the Navagraha Homam being conducted by the Vedic pundits of Sri Venkateswara Vedic Varsity in Tirupati on Friday.

It may be mentioned here that the University has been observing Japa and Homam since March 17, invoking the blessings of different deities to get rid of the dreadful Corona COVID 19 virus which is sabotaging the lives of human beings across the world.

After taking part in this fete, TTD Board Chief said, in view of ongoing crisis, TTD has been conducting various religious activities including Dhanwantari Japam, Dhanwantari Homam, Yogavashisthya Mantra Parayanam, various Japa and Homas at Tirumala and in Tirupati from the past one and a half months. “Our intention is to protect the entire man kind from evil effects of COVID 19”, he added.

On his arrival, he was welcomed by the varsity VC Sri Sannidhanam Sudarshana Sharma. Later the Chairman couple took part in Kalasa Sthapana, Kalasa Puja, Ganapathi Puja, Sankalpa Puja, Agnipratistha and Purnahuti of Navagraha Shanti Homam.

Earlier the Chairman also visited Tirumala temple and Tiruchanoor temple. He also visited Archaka Bhavanam in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్ర‌పంచ శాంతి కొర‌కు నవగ్రహ శాంతి హోమము  – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై,వి.సుబ్బారెడ్డి
     
తిరుప‌తి, 2020 మే 01: ప్రపంచాన్ని వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు నవగ్రహ మంత్ర జపము మరియు నవగ్రహ శాంతి హోమము నిర్వ‌హిస్తున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ  వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యాగశాల‌ ప్రాంగణములో శుక్ర‌వారం కరోనా వైరస్ వ్యాప్తి నివార‌ణ‌కు నిర్వ‌హిస్తున్న నవగ్రహ శాంతి హోమములో ఛైర్మ‌న్ దంప‌తులు పాల్గొన్నారు.
       
ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ క‌రోనా వ్యాస్తి నివార‌ణ‌లో భాగంగా తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మార్చి 17వ తేదీ నుండి జ‌ప‌, హోమాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థ‌, తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలోని వేద పాఠ‌శాల ఆధ్వ‌ర్యంలో శ్రీ ధ‌న్వంత‌రి మ‌హాయాగం, శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం పారాయ‌ణం త‌దిత‌ర ధార్మిక కార్య‌క్ర‌మాలను నిరంత‌రాయంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు.    

కాగా న‌వ‌గ్ర‌హ శాంతి హోమ‌ములో భాగంగా క‌ల‌శ స్థాస‌న‌, క‌ల‌శ పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌నం, సంక‌ల్ప పూజ‌, పూర్ణాహుతి నిర్వ‌హించారు. అనంత‌రం హోమ‌ములో పాల్గొన్న రుత్వికుల‌కు ఛైర్మ‌న్ దంప‌తులు వ‌స్త్ర బ‌హుమానం అందించారు.  ఈ హోమ‌ములో ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ పాల్గొన్నారు.

అంత‌కుముందు టిటిడి ఛైర్మ‌న్ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యాన్ని, తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యాన్ని ద‌ర్శించారు. అనంత‌రం శుక్ర‌వారం సాయంత్రం తిరుమ‌ల‌లోని అర్చ‌క  నిల‌యంను సంద‌ర్శించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.