TTD CONDEMNS FALSE REPORTS AGAINST IT BY A SECTION OF THE MEDIA _ టిటిడిలో ఉచిత సేవలకు మంగళం అని కొన్ని పత్రికల్లో ప్రచురించిన వార్తలు అవాస్తవం.

Tirumala, 3 Jul. 21: TTD has seriously condemned the reports by a section of media which tried to create confusion among devotees.

In a press statement released on Friday evening, terming the media reports as void from facts, TTD advocated that it has not stopped any free service in Tirumala.

Putting forth the factual reports, TTD stated that before March 2020, there were all together 176 counters in Tirumala issuing laddus, darshan tokens, SSD counters, SED counters, Alipiri toll gate counter at Tirupati.

Out of which 86 were operated by Trilok, 40 by various banks, 18 laddu sevaks, and 29 by FM Agencies.

While Trilok withdrew it’s services even before March 2020, other banks also gave up as it involved cash transactions. Similar with the case of Laddu Sevaks.

At present only two banks are running 16 counters and they are also pressurizing TTD on their withdrawal from services.

At this juncture, to give more transparent services to devotees, TTD has called for tenders which took place in a transparent manner.

KVM Info from Bengaluru which quoted the lowest bid in tender with Rs. 11,402 per shift per counter as against the previous value of Rs. 12,345 (both excluding GST).

TTD has reduced the counters from 176 to 164 as per it’s a requirement and even introduced deployment of personnel on a rotation basis changing staff once in every two months to avoid giving scope to any sort of misappropriation.

When TTD is taking decisions and implementing them for the good of pilgrims, it is sad that a section of media is trying to malign image of TTD among devout with their negative reports. Basing on these false reports, some people with Ulterior motives are trying to play games with the sentiments of devotees which is completely unethical.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడిలో ఉచిత సేవలకు మంగళం అని కొన్ని పత్రికల్లో ప్రచురించిన వార్తలు అవాస్తవం.

తిరుమల, 2021 జూలై 03: భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ ఒక ప్రకటనలో ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరం. భక్తులకు అందిస్తున్న ఎలాంటి ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలకలేదని స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా వాస్తవాలను వివరిస్తోంది.

– టిటిడిలో 2020 మార్చికి ముందు తిరుమ‌లలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట త‌ల‌నీలాలు స‌మ‌ర్పిచే భ‌క్తులకు టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ద‌ర్శ‌నం టికెట్లు స్కానింగ్ కౌంట‌ర్లు, తిరుప‌తిలోని ఎస్‌ఎస్‌డి కౌంట‌ర్లు, అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్లు కలిపి 176 కౌంటర్లు ఉండేవి.

– ఇందులో త్రిలోక్ ఏజెన్సీ 89 కౌంటర్లు, వివిధ బ్యాంకులు 40 కౌంటర్లు, లడ్డూ సేవకులు 18 కౌంటర్లు, 7 ఎఫ్ ఎం ఏజెన్సీ 29 కౌంటర్లు ( నగదుతో)నడిపారు.

– త్రిలోక్ సంస్థ మార్చి 2020కి ముందే వారి సేవలు ఉపసంహరించుకుంది. 29 కౌంటర్లు నడిపిన 7 ఎఫ్ ఎం ఏజెన్సీ కాంట్రాక్టు సమయం అయిపోయింది. నగదు లావాదేవీలు ఉన్నందున ఈ కౌంటర్లు నడపలేమని బ్యాంకులు వెనక్కు వెళ్లాయి. ఇదే కారణంతో శ్రీవారి సేవకుల సేవలు కూడా ఉపసంహరించాము.

– ప్రస్తుతం రెండు బ్యాంకులు మాత్రమే 16 లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాంకులు కూడా కౌంటర్లు తమ నుండి వెనక్కి తీసుకోవాలని టిటిడిపై ఒత్తిడి తెస్తున్నాయి.

– ఈ క్రమంలో తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు పారదర్శకంగా, మరింత నైపుణ్యంగా సేవలు నిర్వ‌హించాలని టిటిడి భావించింది.

– ఇందుకోసం ఐదు సార్లు టెండర్లు పిలవగా ఐదవ సారి బెంగళూరుకు చెందిన‌ కెవిఎం ఇన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింది.

– గతంలో ఒక కౌంటర్లో ఒక షిఫ్ట్ కు రూ.12,345 ( జిఎస్టీ కాకుండా) ఉండగా, ప్రస్తుతం రూ 11,402 కే ( జిఎఎస్టీ కాకుండా) టెండరు ఖరారయ్యింది. ఈ టెండర్లు కూడా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగింది.

– టిటిడి అవసరాలకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్యను 176 నుండి 164కు తగ్గించింది.

– భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వృత్తి నైపుణ్యతకు సంబంధించి వీరికి శిక్షణ ఇచ్ఛాము.

– కౌంట‌ర్ల‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఈ కొత్త విధానం ద్వారా రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో రెండు నెలకు ఒక సారి సిబ్బందిని మార్చే వెసులుబాటు ఉంది.

– భక్తుల విశాల ప్రయోజనాలు, మెరుగైన సేవల లక్ష్యంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు అరకొరగా అర్థం చేసుకుని మీడియా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు.
– పత్రికల్లో ప్రచురితమైన అసత్య వార్తల ఆధారంగా కొంత మంది వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం మానుకుని, విజ్ఞతతో మాట్లాడాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.