TTD- DARSHAN MODALITIES CONFERENCE AIMED AT BETTERMENT OF DARSHAN TO PILGRIMS”-TTD EO _ శ్రీవారి భక్తులకు మెరుగైన దర్శన కల్పనే దర్శన-విధి విధానాలు సదస్సు లక్ష్యం – తితిదే ఇఓ

TIRUPATI, NOV 15:  The two-day conference on the “Perspective of
Darshan at Tirumala Temple” to be convened by TTD on November 20 and 21 is aimed at providing better darshan to pilgrims, said TTD EO Sri IYR
Krishna Rao.


Elaborating the motto of the conference during a media brief at Sri Padmavathi Guest House in Tirupati on Monday, he said since TTD is
aiming at brining a paradigm shift in the darshan system for the sake of the pilgrims, we welcome all sections of people to take part in this meet and express their ideas apart from the intellectual fraternity”, he added.

He said, the honourable Justice of AP High Court, Sri N.Rama Mohana
Rao will inaugurate the seminar on November 20, while various papers
on temple and its darshan related issues will be submitted later by former TTD EO, Sri Ajeya Kallam, Principal Secretary to Governor Jammu and Kashmir and In-charge of Vaishnavo Devi temple, Sri RK Goel, Dharmadhikari of Dharmasthala, Karnataka Sri Veerendra Heggade,
Chairman of the Management Committee of Chilakur Sri Balaji
Venkateswara Swamy temple, Sri MV Soundara Rajan in the morning session.

 “In the noon session there will be a paper presentation on “Moving
Platform” (inside the temple) followed by presentation of papers by
media heads. The day one meet will conclude with “Tirumala Vaibhavam”
dance ballet by SV Music and Dance college students”, EO said.
 Further elaborating the scheduled programme, the EO Mr.Rao said, the
second day will commence with the presentation of papers on Agamas
with reference to facilitating better darshan etc. by former TTD EO
and retired IAS, Sri PVRK Prasad, chief priest of the temple Sri AV
Ramana Dikshitulu, Agama advisors, Sri Sundara Vadana Bhattacharyulu,
Sri Vishnu Bhattacharyulu and Sri Appikatla Jagannadhacharyulu while
in the noon the key note address will be delivered by senior IAS
officer and former TTD EO, Sri I V Subba Rao and the closing ceremony
will be presided over by the TTD specified authority chairman Sri J
Satyanarayana”, Mr.Rao said.

Giving a clear statistical data about the existing darshan system in
Tirumala temple, the EO, Sri Rao said, the average annual pilgrim
turnout to Tirumala temple as per current statistical figures stands
at 2.5crores with roughly 20lakhs pilgrims having their darshan during
every month. “We have noticed that the pilgrim crowd is maximum during
the months of April and May”, he added.

The EO said, “Of the total annual pilgrim influx, about one crore
are Sarva Darshan pilgrims, 49lakhs are pedestrian pilgrims and these
two categories alone constitute 60% of the total pigrim crowd
earmarked in a year. While the rest includes, Rs.50 sudarshan token
pilgrims who are to the tune of nearly 41lakhs with 16%, 33.7lakhs
Pratyeka Pravesha Darshan pilgrims constituting about 13%,
7.5lakhs-Physically handicapped, 4lakhs-parents with infants,
7lakhs-seva pilgrims who all together constitute over 8%, while
6.9lakhs are VIPs comprising 2.7%”.

Mr.Rao said, in a day, on an average, the temple management has
allotted about 19h15min for the darshan for pilgrims while 3h13min has
been allotted for performing rituals and the remaining 1h32minutes is
the resting time for Lord Venkateswara.

The EO further said, “The year 2009 has recorded both highest and
lowest turnout of pilgrims in the temple history with the highest
number of pilgrim turnout who had darshan being recorded as 1.12lakhs
on October 4 while the lowest number being 45,500 which is recorded on
December 15. But the average pilgrim crowd is being recorded as
60-70thousands which lasts for nearly 143 days in a year”.
 

Mr.Rao said the TTD will also welcome the suggestions and advices by
pilgrims across the country in the form of letters and e-mails keeping
in view the time constraint in the two-day conference.
 Joint EO(Tirumala) Sri J.Bhaskar and other officials were also
present at the press conference.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD.

 

శ్రీవారి భక్తులకు మెరుగైన దర్శన కల్పనే దర్శన-విధి విధానాలు సదస్సు లక్ష్యం – తితిదే ఇఓ

తిరుపతి, 2010 నవంబర్‌-15: శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం దేశ, విదేశాల నుండి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన దర్శనం కల్పించడమే దర్శనం – విధి విధానాలు సదస్సు ముఖ్యోద్ధ్యేశ్యమని తితిదే ఈఓ శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు అన్నారు.

తిరుపతిలోని శ్రీపద్మావతి అతిధి భవనంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సదస్సు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతో, ఈనెల 20, 21వ తేదీలలో దర్శన విధి విధానాలపై స్థానిక మహతి ఆడిటోరియంలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సును గౌరవనీయులు అంధ్రప్రదేశ్‌ హైకోర్టు జస్టీస్‌ శ్రీ ఎన్‌.రామ్‌మోహన్‌ రావు నవంబరు 20 ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారన్నారు.

సదస్సులో తొలి అంశాన్ని పూర్వ తితిదే ఈఓ శ్రీ అజేయకల్లం ప్రసంగిస్తారన్నారు. వీరితోపాటుగా జమ్మూ-కాశ్మీర్‌ గవర్నరు ముఖ్య కార్యదర్శి, వైష్ణవోదేవి ఆలయం పర్యవేక్షకులైన శ్రీ ఆర్‌.కె.గోయల్‌, కర్ణాటకలోని ధర్మస్థల ధర్మాధికారి శ్రీ వీరేంద్రహెగ్డే, చిలకూరు శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వాహక కమిటీ అధ్యకక్షులు ప్రొ.ఎం.వి. సౌందర్‌రాజన్‌లు కూడా ప్రసంగిస్తారన్నారు.

అదే రోజు భోజన విరామానంతరం శ్రీవారి ఆలయంలో ”చలనవేదిక” ఏర్పాటుపై పత్ర సమర్పణ, అనంతరం వివిధ మీడియా సంస్థల అధినేతలు, ప్రతినిధులతో తిరుమల శ్రీవారి ఆలయంపై వార్తాశైలి తదితర అంశాలపై చర్చాగోష్ఠి ఉంటుందన్నారు. ఎస్వీ సంగీత, నృత్యకళాశాల విద్యార్థుల తిరుమల వైభవం ప్రదర్శనతో తోలిరోజు కార్యక్రమాలు ముగుస్తాయన్నారు.

ఇక రెండవ నాడు శ్రీవారి భక్తులకు ఆగమోక్తంగా దర్శనం కల్పనపై తితిదే పూర్వ కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీరమణదీక్షితులు, ఆగమ పండితులు శ్రీసుందర వదన భట్టాచార్యులు, శ్రీ విష్ణుభట్టాచార్యులు, శ్రీ అప్పికట్ల జగన్నాధాచార్యులు ప్రసంగిస్తారన్నారు.

అదే రోజు మధ్యాహ్నం”సుదర్శనం” పై తితిదే పూర్వ ఈఓ, సీనియర్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి డాక్టర్‌ ఐ.వి.సుబ్బారావు కీలకోపన్యాసకులుగా వ్యవహరిస్తారన్నారు. ఇక ముగింపు కార్యక్రమానికి తితిదే ప్రత్యేక పాలన అధ్యకక్షులు శ్రీ జె.సత్యనారాయణ పాల్గొంటారన్నారు.

        ప్రస్తుత సంవత్సరానికి దాదాపు 2.5 కోట్లు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. అంటే నెలకు సుమారు 20 లక్షల మంది భక్తులకు తితిదే దర్శనం కల్పిస్తూందన్నారు. కాగా సర్వదర్శన భక్తులు దాదాపు కోటి మంది వుండి 40% వారికే దర్శన భాగ్యం కల్గుతుందన్నారు. ఇక కాలిబాట భక్తులు ఏడాదికి సుమారు 49 లక్షల మంది వస్తున్నారు. సర్వదర్శన కాలిబాట భక్తుల శాతమే దాదాపు 60% ఉదన్నారు. ఇక రు.50/- సుదర్శన్‌ టోకన్‌ భక్తుల సంఖ్య 41 లక్షలుగా ఉండి 16% దర్శనం పొందగా, ఇటీవల (గత ఏడాది) ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తుల సంఖ్య 33.7 లక్షలు ఉండి 13% ఉందన్నారు. ఇక వికలాంగ భక్తులు ఏడాదిలో 7.5 లక్షలు, చంటి బిడ్డ తల్లిదండ్రులు 4 లక్షలు, ఇతర సేవాభక్తులు 7 లక్షలు దర్శించుకుంటున్నారన్నారు. ఇక విఐపిలు సంవత్సరానికి 6.9 లక్షల మంది దర్శనం పొందుతూ 2.7% మాత్రమేనన్నారు.

ఒక రోజులో భక్తులకు కల్పించే దర్శన సమయం 19 గం. 15 నిముషాలు, సేవలకు కేటాయించిన సమయం 3 గం. 13 నిముషాలైతే మిగిలిన 1 గం. 32 నిముషాలు స్వామివారికి విశ్రాంతి సేవకు, సరిపోతున్నదన్నారు. ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబరు 4న-1.12 లక్షల మంది గరిష్టంగా, అదే ఏడాది డిశెంబరు 15న -45,500 మంది కనిష్ఠంగా స్వామిని దర్శించుకున్నారన్నారు. ఒక ఏడాదిలో సుమారు 143 రోజులు ఎక్కువ రద్దీ కలిగి దాదాపు 60-70 వేల మంది స్వామిని సేవిస్తున్నారని విఫలంగా శ్రీ కృష్ణారావు గణాంకాలను తెలిపారు.

సదస్సులో వచ్చే సలహాలు-సూచనలు కూడా వీటిననుసరించే ఉండగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. మేధావులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తమ సూచనలను తెలుపడానికి వీలుగా సదస్సు అనంతరం కూడా ఉత్తరాలు ఈ-మెయిల్స్‌ పంపవచ్చన్నారు. ఈ సమావేశంలో తిరుమల జె.ఇ.ఓ. శ్రీ కె. భాస్కర్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.