TTD EDUCATIONAL INSTITUTIONS REACH TO ANOTHER MILE STONE-SPEAKERS _ టీటీడీ కళాశాలలు స్వయంప్రతిపత్తి దిశగా అడుగులు వేయడం అభినందనీయం- ఎస్వీయు ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డి

TIRUPATI, 12 APRIL 2023: The quality of academics in TTD colleges has now become self reliant and reached another milestone said the speakers during an event held at SPWDPG College.

In connection with TTD Degree colleges getting NAAC A± grade, an event “Journey towards autonomous -A Road Map” was held under the instructions of TTD JEO for Health and Education Smt Sada Bhargavi presided by Dr Mahadevamma, the Principal of SPW Degree and PG college in the college premises on Wednesday.

Stalwarts like SVU Vice Chancellor, All TTD Degree Colleges Advisor Sri Mohan Reddy, Chittoor PKS Government Degree College Assistant Professor and Autonomous Co-ordinator Dr Sujana, Kurnool Silver Jubilee Government Degree College Principal Dr Subrahmanya Kumar besides TTD Education Officer Sri Bhaskar Reddy participated in the event.

They all complimented the efforts put up by SPW, SV Arts and SGS colleges of TTD to get the prestigious NAAC A± certification. “Now these colleges are open to commence professional and self-reliant courses that would be very useful for the students”, they added.

Among others SV University College Development Council Dean Dr Appa Rao, SV Arts College Principal Dr Narayanamma, SGS Arts College Principal Dr Venugopal and other organising members, faculty, students were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ కళాశాలలు స్వయంప్రతిపత్తి దిశగా అడుగులు వేయడం అభినందనీయం

– ఎస్వీయు ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డి

తిరుపతి, 12 ఏప్రిల్ 2023: టీటీడీ డిగ్రీ కళాశాలలు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ సాధించి, స్వయంప్రతిపత్తి దిశగా అడుగులు వేయడం అభినందనీయమని ఎస్వీయు ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో ప్రిన్సిపల్ డా.మహదేవమ్మ అధ్యక్షతన బుధవారం సాయంత్రం ” జర్నీ టువార్డ్స్ అటానమస్ – ఎ రోడ్ మ్యాప్” అనే అంశంపై వర్క్ షాప్ జరిగింది. టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన టీటీడీ విద్యాశాఖ అధికారి డా. ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో 33 విద్యాసంస్థలు నడుస్తున్నాయన్నారు. తిరుపతిలోని డిగ్రీ కళాశాలలు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించి చరిత్ర సృష్టించాయని చెప్పారు. ఈ మూడు కళాశాలల ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ గ్రేడ్ సాధించేందుకు సహాయ సహకారాలు అందించిన జేఈవో శ్రీమతి సదా భార్గవికి కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ డిగ్రీ కళాశాలల అటానమి కమిటీ గౌరవ సలహాదారు డా.ఎల్ఆర్ మోహన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్వి ఆర్ట్స్ కళాశాల, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలు మరో మెట్టు ఎక్కేందుకు స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఇందుకోసం అవలంబించాల్సిన మార్గదర్శకాలను తెలియజేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలో విద్యార్థుల అభివృద్ధి కోసం తగిన కోర్సులను ప్రవేశ పెట్టుకోవచ్చని చెప్పారు.

కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి సుబ్రహ్మణ్య కుమార్ కీలక ఉపన్యాసం చేశారు. కళాశాలలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం వల్ల స్వయం ఉపాధికి అవసరమైన కోర్సులు రూపొందించుకోవచ్చన్నారు. ఎన్.సి.సితోపాటు విద్యార్థుల ఆసక్తిని బట్టి తగిన అంశాలను సిలబస్ లో పొందుపరచుకోవచ్చని తెలియజేశారు.

చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, అటానమస్ కో-ఆర్డినేటర్ డా పి.సుజన మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి గల కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు ప్రవేశ పెట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు ఎక్కువ మంది చేరే అవకాశం ఉంటుందని, పరిశోధనలకు పెద్దపీట వేయవచ్చని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ డా.అప్పారావు, ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. నారాయణమ్మ, ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.వేణుగోపాల్ రెడ్డి, వర్క్ షాపు ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా. ఉమారాణి, కమిటీ మెంబర్ డా. భువనేశ్వరి దేవి, వార్డెన్ డా. విద్యుల్లత ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.