TTD EO COMPLIMENTS POLICE FOR REUNITING THE CHILD TO HIS PARENTS_ 15 రోజుల్లోనే చంటిబిడ్డ అపహరణ కేసు ఛేదించిన పోలీసులకు టిటిడి ఈవో, జెఈవో అభినందనలు

EO FELICITATES THE COPS WITH LORD’S PRASADAM-COPS THANK TTD FOR THEIR SUPPORT

Tirumala, 2 July 2017: After waging a fortnight’s rigorous search for the nine month old Chenna Kesava, the baby boy was reunited with his parents and I compliment the police for their efforts and also our JEO Sri KS Sreenivasa Raju who gave all support to the cops in tracing out the boy, said TTD Executive Officer Sri Anil Kumar Singhal.

The EO speaking to media persons in Tirumala on Sundayafter felicitating the cops outside temple, he said that a couple of weeks ago, a months old infant of the couple Venkateswarulu and Nagaratnamma from Anantapur district, was abducted in Tirumala. The Police have sent teams to neighboring states also to trace out the child. “With the help of CCTV footage installed at four mada streets, bus stand etc. the cops could able to trace the movement of the kidnappers. And the result is a happy ending with the child being reunited with his parents”, he added.

Adding further the EO said, at present there are 174 cameras inside temple and in four mada streets. All these will be replaced with latest version cameras soon”, he added.

Later the EO along with Tirumala JEO presented the prasadam of Lord Venkateswara to Rayalaseema IG Sri Sridhar Rao, DSP Tirumala Sri Muniramaiah, CIs Sri Venkataravi and Sri Ramakrishna. VGO Sri Ravindra Reddy and SI Sri Timmaiah were also present.

The police officials met the EO and JEO in the former’s camp office in Tirumala and thanked them for their support in tracing out and reuniting the child with his parents. “Apart from the wide publicity in media and watsapp, the pamphlets and posters printed in thousands in different languages in TTD Printing Press which also helped us a lot. In fact some posters that were pasted on RTC buses en route to Tamilnadu helped us to trace out the child with the help of locals”, the police officials maintained.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

15 రోజుల్లోనే చంటిబిడ్డ అపహరణ కేసు ఛేదించిన పోలీసులకు టిటిడి ఈవో, జెఈవో అభినందనలు

20 వేల కరపత్రాలు, 10 వేల గోడపత్రికలు ముద్రణ

సిసిటివి ఫుటేజిలు, సిబ్బంది, వాహనాలు అందజేత కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారులు

తిరుమల, 02 జూలై 2017: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అపహరణకు గురైన చంటిబిడ్డకు సంబంధించిన కేసును 15 రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసు అధికారులను ఆదివారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అభినందించారు. ఈ మేరకు రాయలసీమ ఐజి శ్రీ ఎన్‌.శ్రీధర్‌, డిఎస్‌పి శ్రీ మునిరామయ్య, సిఐలు శ్రీవెంకటరవి, శ్రీ రామకృష్ణ, ఎస్‌ఐ శ్రీతిమ్మయ్య ఇతర పోలీసు సిబ్బందికి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట శ్రీవారి ప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జూన్‌ 14వ తేదీన శ్రీవారి ఆలయం ఎదుట చెన్నకేశవ అనే చంటిబిడ్డ అపహరణకు గురయ్యాడని, పోలీసు అధికారులు బాగా కష్టపడి జూన్‌ 29న చంటిబిడ్డను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారని తెలిపారు. ఇందుకోసం తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో టిటిడిలోని ఐటి విభాగం, విజిలెన్స్‌ ఇతర విభాగాల అధికారులు చక్కటి సహకారం అందించినట్టు చెప్పారు. భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు వీలుగా శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో ఉన్న సిసి కెమెరాల స్థానంలో ఆధునిక సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి తిరుమలలో భక్తులకు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రత ఏర్పాట్ల కోసం పోలీసులకు టిటిడి తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

అనంతరం డిఎస్‌పి శ్రీ మునిరామయ్య ఆధ్వర్యంలో పోలీసు అధికారులు తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయానికి చేరుకుని టిటిడి తరఫున సహాయ సహకారాలు అందించినందుకు ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో, జెఈవోలకు శ్రీవారి చిత్రపటం, శాలువతో ఘనంగా సన్మానించారు.

డిఎస్‌పి శ్రీ మునిరామయ్య మాట్లాడుతూ టిటిడి ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి 20 వేల కరపత్రాలు, 10 వేల గోడపత్రికలలు తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించి అందించారని, సిసిటివి ఫుటేజిలతోపాటు అవసరమైన సిబ్బందిని, వాహనాలను సమకూర్చారని తెలిపారు. పలు భాషల్లో ముద్రించిన గోడపత్రికలు, కరపత్రాలను బస్సులకు అంటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం చేశామని, సంబంధిత రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లకు అందజేశామని వివరించారు. వీటితో పాటు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా నిందితుల సిసిటివి ఫుటేజీలను ప్రచారం చేస్తూ ప్రతిక్షణం పర్యవేక్షించామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం నామక్కల్‌ జిల్లా బేలుకుర్చి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్కడి పోలీసులు చంటిబిడ్డ అపహరణపై విస్తృతంగా ప్రచారం చేయడం, నిందితుల చిత్రాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం కావడంతో గ్రామస్తులు ప్రశ్నించారని, భయపడిన నిందితులు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారని వివరించారు. అక్కడి పోలీసుల సమాచారంతో చంటిబిడ్డను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.