TTD EO CONDOLES KANCHI PONTIFF DEMISE_ కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యంపై టిటిడి ఈవో సంతాపం

Tirumala,28 February 2018: The TTD EO Sri Anil Kumar Singhal has condoled the sad demise of the 69th Peethadhipati of Kanchi Kamakoti Pontiff Sri Sri Sri Jayendra Saraswati.

In a joint statement along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and Tirupati JEO Sri Pola Bhaskar, he said the Pontiff had been mentor for the TTD in several dharmic and community welfare activities.

He said TTD has commenced Varuna japam and Karirishti yagas since 1994 on Pontiffs advise who had personally participated in one such yagam on June 2, 2017 at Tirumala. The Pontiff had also instrumenal in launching the selfless service front of Srivari Seva in 2000 for facilitating the devotees through various services of the TTD.

In 2004 October 1, the pontiff had presented a diamond crown weighting 9.63 kgs studded with 2060 diamonds, 200 Rubies, 5 jades. He had also been a sprit behind the activities of the HDPP and also presented several discourses on issues of devotion and vedic thought at the Mahati auditorium in Tirupati.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యంపై టిటిడి ఈవో సంతాపం

ఫిబ్రవరి 28, తిరుమల, 2018: ప్రముఖ హిందూ మఠాల్లో ఒకటైన శ్రీ కంచి కామకోటి మఠం 69వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీజయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందడంపై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవోలు శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీ పోల భాస్కర్‌ బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా టిటిడి నిర్వహించిన పలు ధార్మిక కార్యక్రమాలకు కంచి స్వామి అందించిన సహకారాన్ని మరువలేమని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శ్రీ జయేంద్ర సరస్వతి సూచనల మేరకు 1994వ సంవత్సరం నుండి టిటిడి వరుణజపంతోపాటు కారీరిష్టి యాగాన్ని నిర్వహిస్తోంది. 2017 మే 29 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు శ్రీ జయేంద్ర సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో కారీరిష్టి యాగం జరిగింది. భక్తులకు నిస్వార్థ సేవలు అందించేందుకు ఉద్దేశించిన ”శ్రీవారి సేవ” 2000వ సంవత్సరంలో శ్రీ జయేంద్ర సరస్వతి చేతులమీదుగా ప్రారంభమైంది. 2004, అక్టోబరు 1వ తేదీన రూ.1.5 కోట్లు విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని శ్రీ జయేంద్ర సరస్వతి తిరుమల శ్రీవారికి కానుకగా అందించారు. 9.63 కిలోల బరువుగల ఈ కిరీటంలో 2060 వజ్రాలు, 200కు పైగా కెంపులు, 5 పచ్చలు ఉన్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థానమండపంలో జరిగిన సనాతన ధార్మిక సదస్సుల్లో పలుమార్లు శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అమూల్యమైన పలు సూచనలు చేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పలుమార్లు శ్రీ జయేంద్ర సరస్వతి ధార్మికోపన్యాసాలిచ్చారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.