TTD EO HAILS PARTICIPATION OF STUDENTS IN SUNDARA TIRUMALA-SUDDHA TIRUMALA _ సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతం – ఈవో ఎవి ధర్మారెడ్డి పిలుపు

Tirumala, 12 August 2023: TTD EO Sri AV Dharma Reddy on Saturday flagged off the unique mass cleaning program, ShuddhaTirumala-Sundara Tirumala at Alipiri along with the TTD JEO for Health and Education Smt Sada Bhargavi. 

Speaking on the occasion he said it was a blessing for all participants including students for their erstwhile good deeds. About 1000 boys and girls from all the TTD educational institutions led by their respective Principals, teachers and supporting staff participated in this mass cleaning program held on both the Tirumala ghat roads and both the footpaths as well. As part of the agenda the students removed plastic bottles and other solid wastes. 

The EO said all the participants were provided with hand gloves, masks and plastic bags to collect the plastic bottles on ghat roads and footpaths. He said this programme will not only enlighten the employees and students to keep their premises clean but also helps in creating massive awareness among multitude of visiting devotees who are trekking these two footpaths and travelling along ghat roads to keep Tirumala precincts and environs free from plastic.

The VC of SV Vedic University Acharya Rani Sadasivamurthy, SVU VC Sri Raja Reddy, SPM VV VC Smt Bharati, Registrar Smt Rajani, SE-3 Sri Jagadeeshwar Reddy, DEO Sri Bhaskar Reddy, DyEOs Sri Govindarajan, Health Officer Dr Sridevi, Additional Health Officer Dr Sunil Kumar,  Medical Officer Dr Narmada, Principals of several TTD-run colleges and HoDs of all TTD departments were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతం – ఈవో ఎవి ధర్మారెడ్డి పిలుపు

తిరుమల, 2023 ఆగస్టు 12: తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా నిర్వహిస్తున్న “సుందర తిరుమల-శుద్ధ తిరుమల” కార్యక్రమాన్ని శనివారం ఉదయం అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు.

తిరుమల ఘాట్ రోడ్లు , నడక మార్గాల్లో టీటీడీ విద్యా సంస్థల్లోని సుమారు 1000 మంది విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులతో ఈ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. పచ్చదనాన్ని పెంపొందించడం, తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి మే 13వ తేదీ టీటీడీ లోని అన్ని విభాగాల అధికారులు , ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు . ప్రతి మూడు నెలలకోసారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు . విద్యార్థులు రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించినట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన
గ్లౌజులు, మాస్కులు, ప్లాస్టిక్ బ్యాగులు అందించినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో. జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్ వి యు విసి ఆచార్య రాజారెడ్డి, మహిళా యూనివర్సిటీ విసి ఆచార్య భారతి, రిజిస్ట్రార్ శ్రీమతి రజని,ఎస్ ఈ – 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఇఓ శ్రీ భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ ,ఆరోగ్య శాఖ అధికార్లు డాక్టర్ శ్రీదేవి, Dr. సునీల్ వివిధ టీటీడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.