TTD NETS Rs.74CR THROUGH HUMAN HAIR e-AUCTION _ తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.74 కోట్లు

TIRUPATI, SEP 26:  The temple administration of Tirumala Tirupati Devasthanams (TTD) has netted Rs.74cr towards sale of of human hair in e-Auction which held under the supervision of Tirumala Joint EO Sri KS Sreenivasa Raju on Thursday.  Meanwhile, so far TTD fetched highest income through e-Auction of human hair during June last which stood at Rs.130cr.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తలనీలాల విక్రయం ద్వారా తితిదే ఆదాయం రూ.74 కోట్లు

 తిరుపతి, సెప్టెంబరు 26, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదే రూ.74 కోట్ల ఆదాయాన్ని గడించింది.

తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో  గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరిగింది. 1,83,072 కిలోల మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకల తలనీలాల రకాలకు ఈ-వేలం నిర్వహించారు. అయితే ఈ మొత్తంలో 1,40,499 కిలోల తలనీలాలు విక్రయించబడగా రూ.74.07 కోట్ల ఆదాయాన్ని తితిదే ఇందుమూలంగా పొందింది.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.
కిలో రూ.23,462/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 1,399 కిలోలను వేలానికి ఉంచగా అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.3.28 కోట్ల ఆదాయం సమకూరింది.
కిలో రూ.18,650/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 38,607 కిలోలను వేలానికి ఉంచగా 19,600 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.56 కోట్ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.5,500/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 79,610 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 60,800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.33.44 కోట్ల ఆదాయం లభించింది.

కిలో రూ.5,452/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 3,150 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. వీటిద్వారా రూ.11 లక్షల ఆదాయం సమకూరింది.
కిలో రూ.35/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 58,775 కిలోలను వేలంలో అమ్మకానికి ఉంచగా 58,000 కిలోలు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రూ.21 లక్షల ఆదాయం వచ్చింది.

కిలో రూ.9,361/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 1,531 కిలోలను వేలంలో ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. రూ.47 లక్షల ఆదాయం సమకూరింది. అన్ని రకాల వెంట్రుకలు కలిపి వేలంలో మొత్తం రూ.74.07 కోట్ల ఆదాయం తితిదేకి అందింది.
    
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.