TTD EO INSPECTS SESHACHALAM FORESTS _ తిరుమలలోని అటవీప్రాంతంలో ఇ.ఓ తణిఖీలు

TIRUMALA, MAY 4:  With a view to design a plan for outer corridor works as a part of security measure to Tirumala, TTD EO Sri LV Subramanyam along with Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri GVG Ashok Kumar inspected the route in the thick forests of Seshachalam ranges on Saturday.
 
Starting from Gogarbham forest point adjacent to Kalyana vedika, he inspected the forest route covering Bata Gangamma temple, Japali Teertham and Damaragunta.
 
Later talking to media persons he said, the inspection has been carried out as a part of outer cordon works. “With the increase in pilgrim rush, the vehicular traffic to Tirumala is also drastically increasing day by day causing lot of inconvenience to the pilgrims and also leading to environment pollution. To minimise the traffic menace we have constructed outer ring road and diverted the heavy vehicle traffic in this Tiruvenkatapatham road”, he added.
 
Today we have inspected some vital areas in the deep forests of seshachalam ranges to chalk out a design for outer corridor works. The entire route is a house of beaufiful water beds, sceneries, rock structues and plantations. So we are contemplating to beautify this to further level when next phase works of outer corridor get started. So that the pilgrims can circum circle the entire Tirumala ranges and could feel the beautiful experience”, he maintained.
 
SE II Sri Ramesh Reddy, EE I Sri Krishna Reddy, Dy EE Sri Harshavardhan Reddy, AE Sri Devarajulu and others were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలోని అటవీప్రాంతంలో ఇ.ఓ తణిఖీలు

తిరుమల,  04 మే – 2013: తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి సుబ్రహ్మణ్యం శనివారంనాడు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మరియు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి అశోక్‌ కుమార్‌లతో కూడి తిరుమలలోని పలు అటవీ ప్రాంతాలలో తణిఖీ చేశారు.
 
పాపవినాశనం మార్గంలోని గోగర్భం ప్రాంతంలో ప్రారంభమైన ఈ ట్రెక్కింగ్‌ బాటగంగమ్మ, జాపాలి తీర్థం మార్గాల మీదుగా నారాయణగిరి అతిథి భవనం3 ప్రక్కనున్న అటవీ మార్గంలో ముగిసింది.
 
అనంతరం ఇ.ఓ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తిరుమలలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న  నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే వాహనాల సంఖ్య కూడా ఆనూహ్యంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు తిరుమలలోని మార్గాలలో నడవడానికి అనేక అవస్థలు పడుతున్నారన్నారు. తి.తి.దే రెండేళ్ళ క్రితం ప్రారంభించిన తిరువేంకటపథం మార్గంలో వాహనాలు మళ్ళించిందని తెలిపారు. తాము నేడు పర్యటించిన అటవీమార్గంలో తిరుమల భద్రత దృష్ట్యా ఔటర్‌ కారిడారు ఏర్పాటుకు మార్గాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. తిరువేంకటపథానికి కుడి భాగంలో ఉన్న ప్రాంతంలో మలివిడత ఔటర్‌కారిడారు నిర్మాణానికి యోచిస్తున్నామన్నారు. అంతే కాకుండా తాము నేడు నడచిన మార్గంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు నిక్షిప్తమై ఉన్నాయన్నారు.ఈ మార్గంలో పురాతనమైన రాతికొండలు వెలసివున్నాయన్నారు.  వీటికి విద్యుదీపాలంకరణచేసి భక్తులు సందర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దడానికి యోచిస్తున్నట్లు తెలిపారు. తద్వారా భక్తులు తిరుమల కొండనంతా కూడా ప్రదక్షిణంగా చుట్టివచ్చిన మధురానుభూతి కలుగుతుందని ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో ఎస్‌.ఇ.2 శ్రీ రమేష్‌రెడ్డి, ఇ.ఇ శ్రీ కృష్ణారెడ్డి, డిప్యూటి.ఇ.ఓ శ్రీ హర్షవర్థన్‌రెడ్డి, ఏ.ఇ శ్రీదేవరాజులు తదితర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.