TTD EO LAUNCHES KANNADA VERSION OF TTD WEBSITE_ భక్తులకు అందుబాటులోకి టిటిడి వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌

Tirupati, 1 November 2017: The Executive Officer Sri Anil Kumar Singhal today launched the Kannada version of the TTD website -www.sevaonline.com with an intent to facilitate devotees from Karnataka to book Srivari Sevas, darshan, laddu and rooms.

The Telugu version of the website was launched by AP Chief Minister on Sep 23 during the annual Brahmotsavam and the TTD plans to launch the Tamil version of the website also in near future.

Non-English knowing devotees of Lord Venkateswara can now use these websites to book their srivari arjita sevas, electronic dip, Rs 300 ticket for special darshan, rooms, kalyana vedika etc. online. Same ways they can also down load all e- publications of the TTD for online reading. They can also contribute to Srivari Hundi and other trusts of the TTD for serving devotees and mankind.

Among others TTD JEO Sri Pola Bhaskar, IT Head Sri Sesha Reddy, Chief Information officer Sri Sudhakar, TCS officials Sri Bheema Sekhar and Sri Sathya also participated in the event


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తులకు అందుబాటులోకి టిటిడి వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌

నవంబరు 01, తిరుపతి, 2017: శ్రీవారి సేవలు, బస తదితర సేవలను బుక్‌ చేసుకునేందుకు ఉద్దేశించిన ttdsevaonline.com వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌ను భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం టిటిడి వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌ను ప్రారంభించారు.

శ్రీవారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా సెప్టెంబరు 23న ధ్వజారోహణం నాడు టిటిడి వెబ్‌సైట్‌ తెలుగు వర్షన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో తమిళ వర్షన్‌ను కూడా టిటిడి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వెబ్‌సైట్‌లో శ్రీవారి ఆర్జితసేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదులు, కల్యాణవేదిక బుక్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా టిటిడి ప్రచురణలను చదువుకోవడంతోపాటు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. శ్రీవారి హుండీకి కానుకలు, టిటిడిలోని వివిధ ట్రస్టులకు విరాళాలు అందించవచ్చు. కాటేజి దాతలు విరాళం అందించవచ్చు.

ఈ కార్యక్రమంలో తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ శ్రీ సుధాకర్‌, టిసిఎస్‌ అధికారులు శ్రీ భీమశేఖర్‌, శ్రీ సత్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.