GRAND CELEBRATION OF KAISIKA DWADASI ASTHANAM AT SRIVARI TEMPLE_ శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశికద్వాదశి ఆస్థానం

Tirumala, 1 November 2017: TTD conducted the Kaisika Dwadasi Asthanam inside Srivari temple in a grand manner in the early hours.

As part of the festival the Ugra Narasimha idol flanked by consorts Sri Devi and Bhudevi was taken out in a procession in the wee hours and later after entering the Srivari temple the utsava idols were performed Asthanam by the temple priests with recitation of Purana pathanam. TTD mathadhipatis Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy participated in the event.

Speaking on the ocassion TTD EO Sri Anil Kumar Singhal said that once in a year the Ugra Narasimha idol is brought out in a procession on the ocassion of Kaisika Ekadasi and titled as Prabhodotsavam or Uthana Dwadasi.

Temple DyEO Sri Kodandarama Rao, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Peishkar Sri Ramesh Babu, OSD Sri Seshadri, Bokkasam superintendent Sri Gururaja Rao participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా కైశికద్వాదశి ఆస్థానం

నవంబరు 01, తిరుమల, 2017: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారంనాడు సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించింది.

ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల నడుమ శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఉభయనాంచారులతో కలిసి తిరుమాడ వీధులలో ఊరేగారు. అనంతరం ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని మాడ వీధులలో ఊరేగిస్తారని తెలిపారు. కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారని చెప్పారు. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా పిలుస్తారని వివరించారు.

కాగా, కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్‌ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివో శ్రీమతి సదాలక్ష్మి, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు, ఓఎస్‌డి శ్రీపాల శేషాద్రి, బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీగురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.