TTD EO OFFERS SILK VASTRAMS IN MANTRALAYAM_ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి ఈవో

Tirumala, 9 August 2017: In connection with 346th Aradhana Mahotsavams of Sri Raghavendhra Swamy of Mantralayam in Kurnool district of Andhra Pradesh, TTD EO Sri Anil Kumar Singhal on Wednesday offered the silk vastrams on behalf of TTD on this occasion.

Sri Raghavendra Swami, one of the greatest philosophers of those times, was born in 1595 in Kaveripattana, Tamil Nadu to Thimmanna Bhatta and Gopikamba couple. He was named Venkatanatha as he was born by the grace of Lord Venkateshwara. TTD has been offering the sesha vastram as a token to the great services rendered by saintly persons for the propagation of Hindu Sanatana Dharma since 2006.

Sri Subudhendra Tirtha Swami, the present Peethadhipathi of Sri Raghavendra Swami Mutt, rendered blessings to TTD EO on his arrival and received the silk vastrams.

Bokkasam Incharge Sri Gururaja Swamy was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి ఈవో

ఆగస్టు 09, తిరుపతి, 2017: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 346వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.

హైందవ సనాతన ధర్మవ్యాప్తికి క షి చేసిన సద్గురువుల భగవత్‌ భాగవత సేవల ద ష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి క పతో 1595వ సంవత్సరంలో తమిళనాడులోని కావేరిపట్నంలో శ్రీ తిమ్మన్న భట్ట, శ్రీమతి గోపికాంబ దంపతులకు శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.

ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు ఈవోను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్‌పత్తేదార్‌ శ్రీ గురురాజారావు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.