“VIGIL WITH EAGLE EYES DURING SRIVARI BRAHOTSAVAMS”- TTD CV&SO_ శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో డేగకళ్లతో విధులు నిర్వహించాలి : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

TIRUPATI, 9 August 2017: In view of ensuing annual brahmotsavams of Lord Venkateswara at Tirumala which is scheduled in the last week of September, the TTD Chief Vigilance and Security Officer Sri Ake Ravikrishna, called up on the Vigilance and Security wing officials to vigil with eagle eyes round the clock for the upcoming mega fete without giving scope to any untoward incident.

The preparatory meeting on Vigilance and Security for annual brahmotsavams was held in the chambers of CV and SO in TTD administrative building in Tirupati on Wednesday.

The Vigilance and Security Chief of TTD, directed the officials concerned to be more vigilant in their respective areas. “The safety of pilgrims is our top priority and there should not be any compromise in providing security cover to them. The sleuths should respond quickly whenever such situation arises. The operators monitoring CCTVs should be always alert. Each officer in their respective jurisdiction should orient their sleuths every day as if every day is a new day for them while executing their duties. The sector-wise report should be forwarded to me every day during the annual fete”, he maintained.

Later the CVSO felicitated security staffs who acted diligently in catching hold of thieves at Srinivasam and Vishnu Nivasam rest houses through continuous monitoring of CCTVs. A Home Guard and a scout were also felicitated with commendation letters for acting promptly by giving first aid to a pilgrim and having saved his life, when he fell unconscious near Mahadwaram in Tirumala.

Additional CVSO Sri Siva Kumar Reddy, VSOs Sri Ravindra Reddy and Smt Sada Lakshmi, all sector AVSOs, VIs and other staff were also present in the meeting.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో డేగకళ్లతో విధులు నిర్వహించాలి : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

ఆగస్టు 09, తిరుపతి, 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిఘా, భద్రతా సిబ్బంది 24 గంటల పాటు డేగకళ్లతో విధులు నిర్వహించాలని టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఆకె రవికృష్ణ సూచించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సివిఎస్‌వో కార్యాలయంలో ఆయన నిఘా, భద్రతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏవైనా సంఘటనలు జరిగితే తక్షణమే స్పందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. సెంట్రల్‌ కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సిసిటివిల ద్వారా 24 గంటలపాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలలో భద్రతను పర్యవేక్షించాలన్నారు. సిసిటివిల ఆపరేటర్లు మరింత జాగురూకతతో విధులు నిర్వహించాలన్నారు. సెక్టార్లవారీగా అధికారులు అక్కడి సిబ్బందికి విధులపై ప్రతిరోజూ అవగాహన కల్పించాలన్నారు. ఆయా సెక్టార్ల పరిధిలో జరిగిన కార్యకలాపాలపై ప్రతి రోజు నివేదిక సమర్పించాలన్నారు.

అనంతరం విష్ణునివాసం, శ్రీనివాసం వసతి సముదాయాలలో చోరీలకు పాల్పడుతున్నవారిని గుర్తించిన 7గురు భద్రతా సిబ్బందిని, ముగ్గురు సిసిటివి ఆపరేటర్లను, శ్రీవారి ఆలయం మహద్వారం వద్ద అపస్మారక స్థితిలోకి వెళ్లిన భక్తుడికి సకాలంలో ప్రథమ చికిత్స అందించి కాపాడిన ఒక హోంగార్డును, ఒక స్కౌట్‌ను సివిఎస్‌వో సన్మానించి, రివార్డులు అందజేశారు.

ఈ సమావేశంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, ఎవిఎస్‌వోలు, విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.