TTD EO RELEASES SRI KALYANAMASTU APPLICATIONS AND HANDBILLS _ శ్రీవారి ఆశీస్సులతో ఆగస్టు 7న కల్యాణమస్తు
శ్రీవారి ఆశీస్సులతో ఆగస్టు 7న కల్యాణమస్తు
– కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో
శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 2022 జూన్ 22: శ్రీవారి ఆశీస్సులతో ఆగస్టు 7వ తేదీ ఉదయం 8 గం.07 నిమిషాల నుండి 8 గం. 17 నిమిషాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్రీకృత కార్యాలయాన్ని బుధవారం ఈవో ప్రారంభించి, కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒకటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు, వధువు నుండి 20 మంది, వరుడి నుండి 20 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, స్వామివారి ఆశీస్సులతో ఉచితంగా జరిపించుకోవాలన్నారు. జూలై 1 నుండి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం కల్యాణమస్తు దరఖాస్తు పత్రాలను అన్ని జిల్లా కేంద్రాలకు పంపుతున్నట్లు చెప్పారు. టీటీడీ నుండి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక
కో అర్డినేటర్‌ను నియమించి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్‌డివోలతో సమన్వయం చేసుకుని కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.
జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డెప్యూటీ ఈవోలు శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ గోవిందరాజన్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
SRIVARI BLESSINGS FOR KALYANAMASTU ON AUGUST 7
Tirupati, 22 June 2022: TTD EO Sri AV Dharma Reddy said on Wednesday that with the blessings of Sri Venkateswara the prestigious program of Kalyanamastu will be conducted in all the 26 district headquarters across AP on August 7 between 8.07am and 8.17am.
TTD EO launched the central office of the Sri Kalyanamastu program at the SVETA Bhavan in Tirupati and also released the application forms and handbills for the notable event.
Speaking on the occasion the EO said as part of its mandate for promoting a common wedding platform for poor brides and bridegrooms, TTD also provides gold Talibottu of 2 gms, a pair of silver toe rings, new pattu vastrams to both grooms and brides, wedding feast to 20 guests each from bride and groom.
He said the registration for the Sri Kalyanamastu program will take place between July 1 and July 20 at all district headquarters and forms will be sent to all centres by TTD.
TTD will appoint a Co-ordinator (Nodal Officer) at each district centre to coordinate with the respective district collector and joint collector to conduct the Sri Kalyanamastu program.
Earlier along with JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, TTD EO performed special pujas at the Central office of Sri Kalyanamastu program.
TTD CVSO Sri Narasimha Kishore, DyEOs Smt Vijayalakshmi, Sri Govindarajan, SVETA Director Smt Prashanti and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI