TTD EO RELEASES SRI PAT POSTERS_ శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరించిన టిటిడి ఈవో

Tiruchanoor, 27 October 2017: The posters of annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavari temple was released by TTD EO Sri AK Singhal on Saturday.

As the mega religious event is scheduled between November 18-23, the EO along with Tirupati JEO Sri P Bhaskar and Temple Spl Gr DyEO Sri P Munirathnam Reddy released the posters in his chambers in TTD administrative building in Tirupati.

GODDESS RIDES ON GAJA VAHANAM

The processional deity of Goddess Padmavathi Devi took celestial ride on Gaja Vahanam along the four mada streets of the temple in Tiruchanoor on Friday evening.

Akin to Pournami Garuda Vahana seva every month in Tirumala, the Goddess takes ride on Gaja Vahana Seva every month on the auspicious advent of Uttarashada Nakshatra, which happens to be the birth star of Goddess Sri Padmavathi Devi.

Devotees took part in large numbers to witness the procession of Goddess. Temple officials also took part in this celestial event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరించిన టిటిడి ఈవో

తిరుపతి, 2017 అక్టోబరు 27: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌తో కలిసి ఆవిష్కరించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరాషాడ నక్షత్రంను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గజవాహనసేవలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ నవంబరు 15వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు నవంబరు 23వ తేదీన పంచమితీర్థంతో ముగుస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాహనసేవలు ఉంటాయని, తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

బ్రహ్మోత్సవాలకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నట్లు వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాలు, ఆరోగ్య విభాగం, వైద్యం, ఆయుర్వేదం, భద్రాతా విభాగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి జెఈవో మాట్లాడుతూ అమ్మవారి వాహనసేవల ముందు వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన ప్రముఖ కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వారికి ఆడియో పరికరాలను టిటిడి అందించనుందని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని ఆర్జితసేవలను రద్దు చేశామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ రాధాకృష్ణ, ఇతర అధికారులు, పాల్గొన్నారు. అమ్మవారి గజవాహనసేవలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల వివరాలు

1తేదీ ఉదయం రాత్రి

15-11-2017(బుధవారం) ధ్వజారోహణం చిన్నశేషవాహనం

16-11-2017(గురువారం) పెద్దశేషవాహనం హంసవాహనం

17-11-2017(శుక్రవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

18-11-2017(శనివారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం

19-11-2017(ఆదివారం) పల్లకీ ఉత్సవం గజవాహనం

20-11-2017(సోమవారం) సర్వభూపాలవాహనం స్వర్ణరథం, గరుడవాహనం

21-11-2017(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

22-11-2017(బుధవారం) రథోత్సవం అశ్వ వాహనం

23-11-2017(గురువారం) పల్లకీ ఉత్సవం,

పంచమీతీర్థం ధ్వజావరోహణం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.