REVIEW ON SOLID WASTE AND VECTOR MANAGEMENTS HELD_ ఘనవ్యర్థాల నిర్వహణ, కీటకాల నివారణపై టిటిడి ఈవో సమీక్ష

Tirumala, 27 October 2017: TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju held a detailed review meeting on sold waste management and vector management.

The meeting with Engineering, Health, Annaprasadam and Garden wings took place at Annamaiah Bhavan in Tirumala on Friday.

The EO directed the Chief Engineer Sri Chandra Sekhar Reddy and SE II Sri Ramachandra Reddy to come out with proposals of short, medium and long term plans on Solid waste management. Later he also instructed the Health Officer Dr Sermista to chalk out plans vector (disease spreading organisms like flies, mosquitoes, cockroaches etc.) management.

Earlier the Health officer demonstrated the precautionary measures to control flies and other disease spreading insects through power point presentation.

He also instructed the Garden Wing Dy.Director Sri Srinivasulu to make use of the dung generated from Dairy Farm at Tirumala as natural manure for gardening purpose in a better way.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనవ్యర్థాల నిర్వహణ, కీటకాల నివారణపై టిటిడి ఈవో సమీక్ష

అక్టోబరు 27, తిరుమల, 2017: తిరుమలలో ఘనవ్యర్థాల నిర్వహణ, వ్యాధులను వ్యాప్తిచేసే కీటకాల నివారణపై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి అన్నమయ్య భవనంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించిన దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించాలని చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా, వ్యాధులకు కారణమయ్యే ఈగలు, దోమలు, బొద్దింకలు లాంటి కీటకాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖాధికారి డా||శర్మిష్టకు సూచించారు. అంతకుముందు ఈగలు, ఇతర కీటకాల నివారణకు తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆరోగ్యశాఖాధికారి వివరించారు. తిరుమలలోని డైరీఫామ్‌ నుంచి పేడను సేకరించి ఉద్యానవనాల పెంపకానికి సేంద్రియ ఎరువుగా వినియోగించాలని ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీశ్రీనివాసులును ఈవో ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి ఇంజినీరింగ్‌, ఆరోగ్య, అన్నప్రసాదం, ఉద్యానవన విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.