TTD EO REVIEWS GO MAHA SAMMELAN ARRANGMENTS _ గో మహాసమ్మేళనం ఏర్పాట్లపై ఈవో సమీక్ష

Tirupati, 26 October 2021: TTD Executive Officer Dr. KS Jawahar Reddy on Tuesday evening reviewed the arrangements for the two-day Go Maha Sammelan to be organized by TTD at Mahati Auditorium on October 30 and 31.

Addressing officials at the Sri Padmavati Rest house the TTD EO said special care for the Pontiffs and farmers with regard to food, accommodation, and transportation, etc. shall be taken care of.

He asked the TTD Transport GM to coordinate with RTC to organize shuttle services to Mahati Auditorium from all rest houses of delegates.

 

He also instructed officials to give live coverage in the prime slot of SVBC and also give live coverage on YouTube as well.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao

SV Goshala Director Sri Harnath Reddy, GM Transport Sri Sesha Reddy, and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గో మహాసమ్మేళనం ఏర్పాట్లపై ఈవో సమీక్ష

 తిరుపతి 26 అక్టోబరు 2021 ;తిరుపతి మహతి కళాక్షేత్రంలో అక్టోబరు 30 మరియు 31 వ తేదీల్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గో మహా సమ్మేళనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం రాత్రి సమీక్ష జరిపారు.

గో మహా సమ్మేళనానికి హాజరవుతున్న స్వామీజీలు, మఠాధిపతులు, రైతులకు వసతి, ఆహారం, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఈఓ ఆదేశించారు.

వసతి ప్రాంతాల నుంచి మహతి ఆడిటోరియంకు, తిరుమలకు రవాణా సదుపాయం కల్పించడానికి ఆర్టీసీ అధికారులతో మాట్లాడాలని రవాణా విభాగం జీఎం ను ఆదేశించారు. మహతిలో కార్యక్రమాలను ఎస్వీబీసీ స్లాట్ ను బట్టి లైవ్ ఇవ్వాలని, యు ట్యూబ్ లో పూర్తి లైవ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి,జెఈఓ శ్రీ వీర బ్రహ్మం, సివిఎస్ఓ,శ్రీ గోపీనాథ్ జెట్టి, గోశాల డైరెక్టర్,శ్రీ హరినాథ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు


టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది