TTD EO, TIRUMALA JEO TAKES PART IN PARYAYA PEETHA CEREMONY OF PALIMAR MUTT PONTIFF_ పాలిమర్‌ పీఠాధిపతి పర్యాయ ఉత్సవంలో పాల్గొన్న టిటిడి ఈవో, జెఈఓ

Tirumala, 18 January 2018: TTD EO Sri Anil Kumar Singhal accompanied by Tirumala JEO Sri KS Sreenivasa Raju took part in the biennial Paryaya festival of HH Sri Vidyadheesha Tirtha Swamy of Palimar Mutt in Udipi on Thursday.

On behalf of TTD, they have handed over the prasadams of Lord Venkateswara on this ceremonial occasion. While the chief of Palimar Mutt, Sri Vidyadheesha Thirtha Swamy offered Vedasirvachanam to the official duo.

Paryaya festival, signifies the transfer of power of management and worship of Lord Krishna at the 800-year-old Sri Krishna Temple from one seer to another seer of the Ashta Mutts or eight mutts of Udupi for every two years. This festival is also called Sarvajna Peetha. Sri Vidyadheesha Tirtha Swamy took the charge from Sri Vishwesha Tirtha Swami of Pejawar Mutt in a grand religious ceremony.

Bokkasam In-charge Sri Guru Raja, OSD Tirumala Temple Sri P Seshadri were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పాలిమర్‌ పీఠాధిపతి పర్యాయ ఉత్సవంలో పాల్గొన్న టిటిడి ఈవో, జెఈఓ

రెండోసారి పీఠాన్ని అధిష్టించిన శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామి

తిరుమల, 2018 జనవరి 18: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని శ్రీ పాలిమర్‌ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామివారి పర్యాయ ఉత్సవంలో పాల్గొన్నారు. టిటిడి తరఫున శ్రీవారి ప్రసాదాలను స్వామీజీకి అందించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామివారు టిటిడి ఈవో, జెఈవోలను ఆశీర్వదించారు.

ఉడిపిలో 800 ఏళ్లనాటి పురాతన ప్రాశస్త్యం గల శ్రీకృష్ణస్వామివారి ఆలయం ఉంది. ద్వైత సంప్రదాయాన్ని పాటిస్తున్న అష్ట మఠాల పీఠాధిపతులు ఒక్కొక్కరు రెండేళ్ల చొప్పున ఈ ఆలయ నిర్వహణతోపాటు పూజాకైంకర్యాల బాధ్యతను నిర్వహిస్తారు. ఈ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమాన్ని ”పర్యాయ ఉత్సవం”గా వ్యవహరిస్తారు. దీనిని ”సర్వజ్ఞ ఉత్సవం” అని కూడా అంటారు. పెజావర్‌ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వేశతీర్థస్వామివారి నుంచి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామివారు బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం ఇన్‌చార్జి శ్రీగురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.