TTD GETS READY FOR RATHASAPTHAMI_ రథసప్తమికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు

Tirumala, 18 January 2018: With less than a week left for one of the most important festivals, Rathasapthami, all departments in TTD are gearing up for the celestial fete which occurs on January 24.

Following the festival TTD has cancelled all arjitha sevas, privileged darshan for aged, physically challenged, parents with infants, NRIs, defence personnel and VIP break darshan also anticipating heavy pilgrim influx for the big occasion.

As the Lord Malayappa Swamy takes ride on seven different vehicles on a single day from desk to dawn, this festival is also called One Day Brahmotsavam or mini brahmotsavams.

Surya Prabha-5:30am to 8am (Sunrise Muhurtam:6:45am)
Chinna Sesha-9am to 10am
Garuda-11am to 12noon
Hanumantha-1pm to 2pm
Chakrasnanam-2pm to 3pm
Kalpavriksha-4pm to 5pm
Sarvabhupala-6pm to 7pm
Chandraprabha-8pm to 9pm

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

రథసప్తమికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు

తిరుమల, 2018 జనవరి 18: రథసప్తమి పర్వదినం సందర్భంగా జనవరి 24వ తేదీ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

ఇందులో భాగంగా ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, యన్‌.ఆర్‌.ఐలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా టిటిడి రద్దు చేసింది.

సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

సమయం వాహనం

ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.45 గంటలుగా నిర్దేశించడమైనది)

ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం

ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం

మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం

మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం

సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం

సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం

రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం

కాగా ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.