TTD EO VISITS SCULPTURE COLLEGE _ శిల్ప కళాశాలను సందర్శించిన ఈవో

Tirupati, 08 February 2021: TTD Executive Officer Dr K S Jawahar Reddy on Monday evening visited the SV Sculpture College located near Alipiri and enquired about students welfare and teaching systems with faculty members.

He went round the class rooms of six diploma courses including the Kalamkari painting section.

The college faculty informed him that the sculpture college was only one of its kind in both Telugu states  and presently had 125 students. 

The EO interacted with students and enquired about job opportunities to students after completion of courses.

The EO directed officials to probe into feasibility of sale of wooden statues made in college through  Lepakshi.

He also inspected the granite statue making division and enquired about it’s process, methodologies etc. 

The officials informed that they prepared the statues to Ramathirtha temple within 10 days.

Later the EO inspected vacant land between old and new toll gates at Alipiri and directed engineering officials to study the possibility to avoid traffic jams.

Chief engineer Sri Ramesh Reddy, SE-1 Sri  Jagdishwar Reddy,SE-2 Sri Nageswara Rao,Electrical SE Sri Venkateshwarlu, Devastanam Education Officer Sri Govindarajan, EE Sri Venkat Krishna Reddy and sculpture college incharge principal Sri Venkat Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శిల్ప కళాశాలను సందర్శించిన ఈవో

తిరుపతి 8 ఫిబ్రవరి 2021: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు.
కళాశాలలోని ఆరు డిప్లొమో కోర్సుల తరగతి గదులు, కలంకారీ పెయింటింగ్ విభాగాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఏ విధంగా శిక్షణ తీసుకుంటున్నారనే విషయాలను సంబంధిత అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి కళాశాల ఇంకెక్కడా లేదని అధ్యాపకులు ఈవోకు వివరించారు. కోర్సు పూర్తి అయ్యాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయని ఈవో ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడారు. కళాశాలలో ప్రస్తుతం 125 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన చెక్క విగ్రహాలను లేపాక్షి సంస్థ ద్వారా విక్రయించే అవకాశాలు పరిశీలించాలని ఈవో అధికారులను ఆదేశించారు .అనంతరం రాతివిగ్రహాలు తయారుచేసే విభాగాన్ని పరిశీలించి, విగ్రహాల తయారీకి రాతిని సమకూర్చుకునే పద్ధతులను తెలుసుకున్నారు. రామతీర్థం కు 10 రోజుల్లోనే విగ్రహాలు తయారుచేసి పంపామని శిల్పులు ఈవోకు వివరించారు.

అలిపిరి పాత టోల్ గేట్ – కొత్త టోల్ గేట్ మధ్యన ఉన్న ఖాళీ స్థలాన్ని ఈవో పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా కొంత స్థలంలో నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందేమో పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ 1 శ్రీ జగదీశ్వర రెడ్డి, ఎస్ ఈ 2 శ్రీ నాగేశ్వరరావు, విద్యుత్ విభాగం ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఈ ఈ శ్రీ వెంకటకృష్ణా రెడ్డి, శిల్పకళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీ వెంకట రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.