TTD FACILITIES BOOKING OF IT’S 2022 CALENDARS AND DIARIES THROUGH AMAZON _ టిటిడి వెబ్‌సైట్, అమెజాన్‌లో 2022 డైరీలు, క్యాలెండర్ల బుకింగ్ సదుపాయం
Tirupati, 07 December 2021: TTD has facilitated online booking towards the purchase of its 2022 calendars and diaries to domestic as well as overseas devotees through its official website and Amazon.
The devotees could book directly on the TTD website tirupatibalaji.ap.gov.in by clicking on the publications option and order any quantity of diaries /calendars through debit/credit cards and delivery by the India posts. But they have to pay separately towards packing and shipping charges.
EVEN FOREIGN DEVOTEES
TTD has organised delivery of diaries and calendars to even to the NRI devotees through India posts on payment of prescribed charges and TTD will inform specified date of delivery during online booking.
JUST SEND DD TO TTD
Devotees shall purchase diaries and calendars by post also on submitting a prescribed DD from any nationalised bank taken in the name of “Executive Officer, TTD, Tirupati “ with a covering letter to “ Special officer, Publications and sales wing, Press compound, KT Tirupati “ to same address.
TTD will send the package on the To Pay system (towards postal charges.
For more details on diaries/calendars devotees shall contact the Publications department on 0877-2264209 or the Special Officer on 9963955585
TARIFF OF CALENDARS AND DIARIES ARE AS BELOW
12-page calendar Rs130 each
Big diary Rs.150
Small diary Rs120
Table top calendar Rs 75
Srivari big calendar Rs 20
Sri Padmavati big Calendar Rs15
Srivaru Ammavaru calendar Rs15
Telugu Panchangam –Rs 30
The 2022 diaries and calendars are already available at all TTD publication stalls and TTD information centres at Hyderabad, Bangalore, Chennai, Vijayawada, New Delhi, and Visakhapatnam. Besides they are also available at prominent Kalyana mandapams and TTD linked temples across the country.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి వెబ్‌సైట్, అమెజాన్‌లో 2022 డైరీలు, క్యాలెండర్ల బుకింగ్ సదుపాయం
తిరుపతి, 2021, డిసెంబరు 07: టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఆన్‌లైన్ సర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించడమైనది. టిటిడికి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్”ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపుతారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్, షిప్పింగ్ ఛార్జీలు అదనం.
విదేశాల్లోని భక్తులకు సైతం..
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విదేశాల్లోని భక్తులకు తపాలా శాఖ ద్వారా డైరీలు, క్యాలెండర్లను అందించేలా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. తపాలా శాఖ నిర్దేశిత ఛార్జీలను వసూలుచేసి నిర్ణీత సమయంలో బట్వాడా చేస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు.
డిడి తీసి పంపితే చాలు …
టిటిడి క్యాలెండర్, డైరీలను పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్ లెటర్‌తో కలిపి ”ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కెటి.రోడ్, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం(పోస్టల్ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్, డైరీలను పంపడం జరుగుతుంది. డైరీ, క్యాలెండర్ల కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 0877-2264209 నంబరు ద్వారా ప్రచురణల విభాగం కార్యాలయాన్ని గానీ, 9963955585 నంబరు ద్వారా ప్రత్యేకాధికారిని గానీ సంప్రదించగలరు.
డైరీలు, క్యాలెండర్ల ధరలు ఇలా ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్ రూ.130/-, పెద్ద డైరీ రూ.150/-, చిన్నడైరీ రూ.120/-, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75/-, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20/-, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ – రూ.15/-, శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30/-. తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటితోపాటు ముఖ్యమైన టిటిడి కల్యాణమండపాల్లో, టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో భక్తులకు కోసం సిద్ధంగా ఉంచారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.