TTD FOR EXTENDED DHARMIC CAMPAIGN IN RURAL AREAS- JEO BHASKAR _ గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati ,24 April 2018 : The TTD plans to take up extended campaign for Sanatana Dharma in rural areas , says Tirupati JEO Sri Pola Bhaskar.

Addressing the members of the Dharma Prachara mandali and field staff of the HDPP at the SVETA bhavan he directed them to roll out an action plan for celebration of Hanumath Jayanti on May10th,Sadacharam,Shubhapradam training classes and Sri Venkateswara Rath yatra during the summer months .

He said large number of students of 6,7,8th standards will be enrolled in the Shubhapradam training classes this year.They will be indoctrinated in the basic tenets of the Hindu dharma .

He said TTD will also identify boys and girls in rural areas and train them to function as voluntary Dharmacharyas to take up dharma campaign in village .The HDPP will formulate a training program and call for applications to enrol interested youth as Dharmacharyas , he added .

HDPP secretary Sri A Ramakrishna Reddy, Project officer Sri Ramana Prasad, OSD for dharmic examinations Sri Damodara Naidu, and Sri Prabhakar Rao, OSD for Srinivasa Kalyanam participated in the meeting.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం :టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఏప్రిల్‌ 24, తిరుపతి 2018 ; సనాతన ధర్మాన్ని గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్‌ క్షేత్ర సిబ్బంది, ధర్మప్రచార మండలి సభ్యులతో జెఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 10న హనుమజ్జయంతి, వేసవి సెలవుల్లో సదాచారం, శుభప్రదం శిక్షణ తరగతులు, శ్రీవేంకటేశ్వరస్వామివారి రథయాత్ర తదితర కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ ఏడాది శుభప్రదం శిక్షణలో 6, 7, 8వ తరగతుల విద్యార్థులను మరింత ఎక్కువమందిని భాగస్వాములను చేస్తామన్నారు. విద్యార్థులకు సనాతన ధర్మ మూలాలు సులువుగా అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామస్థాయిలో యువత, మహిళలకు సనాతన ధర్మంపై అవగాహన పెంచేందుకు స్వచ్ఛందంగా పనిచేసే ధర్మాచారులను గుర్తించి శిక్షణ ఇస్తామన్నారు. ఈ ధర్మాచారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో ధర్మప్రచారం చేస్తారని వివరించారు. ఆసక్తిగలవారు నమోదు చేసుకుని టిటిడి నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వీలుగా హిందూ ధర్మప్రచార పరిషత్‌ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎ.రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్‌, ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య డి.దామోదరనాయుడు, శ్రీనివాసకల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకర్‌రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.