GEAR UP FOR SUMMER RUSH-JEO TIRUMALA _ వేసవిలో రద్దీకి తగ్గట్టు భక్తులకు విశేషంగా సేవలందించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 24 April 2018: As the summer rush has commenced in Tirumala, JEO Sri KS Sreenivasa Raju instructed all the HoDs to gear up to make necessary arrangements to cope up with the same.

The weekly review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Tuesday.

Tirumala JEO directed the CMO Dr Nageswara Rao to keep medical services readily available in the Vaikuntham compartments, if any Pilgrim faces an emergency situation. Also keep ready the doctors and paramedical staff at Rambageecha and inside temple, he added.

He instructed the PRO Dr T Ravi to train srivari sevakulu and scouts on how to serve the pilgrims in the case of medical emergencies. He also directed him to on up the choice of area of selection in on-line srivari seva available from April 25 onwards.

Temple DyEO Sri Harindranath, VSO Sri Ravindra Reddy, GM Transport Sri Sesha Reddy and other senior officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

వేసవిలో రద్దీకి తగ్గట్టు భక్తులకు విశేషంగా సేవలందించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఏప్రిల్‌ 24, తిరుమల 2018 ; వేసవి సెలవుల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టు ఆయా విభాగాల అధికారులు సన్నద్ధంగా ఉండి విశేషంగా సేవలందించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జెఈవో వేసవి ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో, శ్రీవారి ఆలయంలో భక్తులు అనుకోకుండా అనారోగ్యానికి గురైతే సకాలంలో సరైన వైద్యసహాయం అందించేందుకు అవసరమైన వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని సిఎంవోను ఆదేశించారు. ఆలయంలోపల, రాంభగీచా విశ్రాంతి గృహాల ఎదురుగా వైద్య సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టాలనే విషయంపై ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

పరకామణి విభాగంలో కానుకల లెక్కింపునకు సంబంధించి సిబ్బందికి, పరకామణి సేవకులకు సరైన సూచనలు చేయాలని జెఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. గోడౌన్లలో నిల్వ ఉంచే పప్పుదినుసుల నాణ్యత తగ్గకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మార్కెటింగ్‌ విభాగంలో పప్పుదినుసులు, ఇతర సరుకుల కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు పొందాలన్నారు. ఆసక్తి గల విభాగాల్లో సేవలందించేందుకు వీలుగా శ్రీవారి సేవకులు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్‌ 25వ తేదీన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను భక్తులకు అందుబాటులో ఉంచాలని పిఆర్‌వోను ఆదేశించారు.

ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, రిసెప్షన్‌ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.