TTD FOR EXTENSIVE DHARMA PRACHARA AT VILLAGE LEVEL- TTD CHAIRMAN _ గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన హైందవ ధ‌ర్మ‌ ప్రచారం : టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirumala, 28 Feb. 20: The Chairman of TTD Trust Board Sri YV Subba Reddy asserted that the TTD will take up extensive campaign of Hindu Sanatana Dharma in villages of AP and Telangana in collaboration with the Samarasata Seva Foundation.

Addressing Executive Committee Meeting of Hindu Dharma Prachara Parishad (HDPP) at Annamaiah Bhavan on Friday he said that 15 villages in each of 360 mandals of both states would be taken up for distribution of Sri Venkateswara Swamy photos, kankanams, stickers and other dharmic material on a door to door basis.

He said TTD will supply pustaka Prasadam of 531 sets of 75 books worth Rs 3020 to the Bala Vikas kendras run by the Seva foundation.

As a part of campaign, TTD has plans to sanction Rs 10 lakh to build each Srivari temples in SC, ST and fishermen colonies.

He said Rs 10 lakhs has been approved for conducting Hindu Atma Gowrava Yatra and Geeta Yajnam on April 11 under the aegis of Hindu Dharmika Seva Samiti in entire AP.

TTD is also providing a financial assistance of Rs 25 lakhs for conduction of Tatayyagunta Gangamma Jatara in Tirupati, the folk Goddess festival, who is revered as the sister of Lord Venkateswara. TTD engineering department has been directed to take up beautification of Tirupati roads for the ensuing Jatara.

Later the TTD chairman also reviewed the development works of BIRRD and SVBC.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, TUDA Chief Sri C Bhaskar Reddy, TTD Board special invitees Sri B Karunakar Reddy, Sri Shiva Kumar, Board member Sri DP Ananta, Tirupati JEO Sri P Basant Kumar, HDPP Secretary Sri Acharya Rajagopalan, HDPP Executive members Sri Penchalaiah, Sri Subba Rao, All Projects Liaison Officer Sri Venkata Sharma and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

 

 

గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన హైందవ ధ‌ర్మ‌ ప్రచారం : టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌,  2020 ఫిబ్ర‌వ‌రి 28: టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ మ‌రియు స‌మరసత సేవా ఫౌండేషన్‌తో క‌లిసి  ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌లోని గ్రామాల‌లో మ‌రింత విస్తృతంగా స‌నాత‌న హైంద‌వ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేయాల‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం సాయంత్రం  హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల‌లోని 360 మండ‌ల‌ల్లో, ఒక్కొక్క మండ‌ల‌ము నుండి 15 గ్రామాల‌ను ఎంపిక చేయ‌ల‌న్నారు. ఆయా గ్రామాల‌లో మొత్త‌ము 4 వేల ఇళ్ళ‌ను ల‌క్ష్యంగా చేసుకుని ధ‌ర్మోర‌క్ష‌తి ర‌క్షితః స్టిక్క‌ర్లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఫోటోలు, కంక‌ణాలు, ఇత‌ర హిందూ ధార్మిక సాహిత్యాన్ని ఇంటింటా  అందించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌న్నారు. స‌మ‌ర‌స‌తా సేవా ఫౌండేష‌న్ నిర్వ‌హించే బాల‌వికాస కేంద్రాలకు పుస్త‌క ప్ర‌సాదంగా వివిధ ఆధ్యాత్మిక‌ పుస్త‌కాల‌ను  అందించాల‌న్నారు.

టిటిడి ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్‌.సి., ఎస్‌.టి., మత్య్సకార కాలనీలు, గ్రామాల‌లో మ‌రో 500 దేవాల‌యాల నిర్మించాల‌ని, ఒక్కొక్క ఆల‌యానికి గ‌రిష్ఠంగా రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేయానున్న‌ట్లు తెలిపారు. హిందూ ధార్మిక సేవా స‌మితి వారి ఆధ్వ‌ర్యంలో 13 జిల్లాల్లో నిర్వ‌హించే హిందూ ఆత్మ గౌర‌వ యాత్ర మ‌రియు ఏప్రిల్ 11వ తేది నిర్వ‌హించే గీతా య‌జ్ఞానికి రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేశామ‌న్నారు. తిరుమ‌ల శ్రీవారి సోద‌రి అయిన తిరుప‌తిలోని శ్రీ తాత‌య్య‌గుంట గంగ‌మ్మ జాత‌ర సంద‌ర్భంగా రూ.25 ల‌క్ష‌లు ఆర్థిక స‌హాయం అందించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

       అనంత‌రం ఆయ‌న‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌, బ‌ర్డ్ ట్ర‌స్టు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ బి.క‌రుణాక‌ర్‌రెడ్డి, డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ డి.పి.అనంత‌, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్, హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌భ్యులు శ్రీ పెంచ‌ల‌య్య‌, శ్రీ సుబ్బారావు, టిటిడి ప్రాజెక్టుల లైజ‌న్ అధికారి శ్రీ వేంక‌ట‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.