TTD GEARS UP FOR BABUJI JAYANTHI_ ఏప్రిల్‌ 5న టిటిడిలో డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

Tirupati, 3 April 2018: TTD has geared up to observe 111th Birth Anniversary of Babu Jag Jivan Ram on April 5.

This event will take place in the quadrangle of TTD administrative building in Tirupati on Thursday by 10am.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 5న టిటిడిలో డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 03: భారతజాతి గర్వించదగ్గ జాతీయ నాయకుల్లో ఒకరు, రాజనీతిజ్ఞుడు, దళితుల జీవితాల్లో వెలుగురేఖలు నింపిన డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌రామ్‌ 111వ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్‌ 5వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించనుంది. తితిదే పరిపాలనా భవనం ప్రాంగణంలో ఉదయం 10.00 గంటలకు జయంతి సభ ప్రారంభం కానుంది. టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.