LIST OF FESTIVALS IN KODANDA RAMALYAM IN APRIL_ ఏప్రిల్‌లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 3 April 2018: The festivals observed in Sri Kodanda Rama Swamy temple in Tirupati in the month of April as follows:

April 7,14,21,28: Abhishekam to Mulavarulu
April 16: Sahasra Kalasabhishekam
April 22: Pushpayagam
April 29: Astottara Satakalasabhishekam

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌లో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 03: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

– ఏప్రిల్‌ 7, 14, 21, 28వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. రూ.20/- చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు శ్రీసీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– ఏప్రిల్‌ 16వ తేదీ అమావాస్యనాడు ఆలయంలో ఉదయం 6.00 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. – ఏప్రిల్‌ 22వ తేదీ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

– ఏప్రిల్‌ 29వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. రూ.50/- చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు, ఆస్థానం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.