TTD GEARS UP FOR ONE DAY MINI BRAHMOTSAVAMS _ మినీ బ్రహ్మోత్సవాలకు టిటిడి సన్నద్ధం 

SRI MALAYAPPA TO BLESS DEVOTEES ON SEVEN CARRIERS ON RADHASAPTHAMI

 

SSD TOKENS STANDS CANCELLED ON JAN 28

 

VIP BREAK AND ARJITA SEVAS REMAINS CANCELLED

 

ADVANCE BOOKING IN ACCOMMODATION CANCELLED ON JAN 27 AND 28

 

FOUR LAKHS BUFFER STOCK OF LADDUS KEPT READY

 

CONTINUOUS SUPPLY OF ANNAPRASADAM AND BEVERAGES IN GALLERIES

 

SHELTERS IN GALLERIES AT REQUIRED POINTS

 

TIRUMALA, 25 JANUARY 2023: The temple management of Tirumala Tirupati Devasthanams geared up to host yet another important annual fete, Radha Sapthami on the auspicious occasion of Surya Jayanthi on January 28 in Tirumala in a big way.

 

In connection with this, TTD EO Sri AV Dharma Reddy along with JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore reviewed with all Heads of various departments at Annamaiah Bhavan in Tirumala on Wednesday. He directed all of them to ensure a smooth conduct of the mega fete by executing their duties with more dedication. The following are the special arrangements in view of

Radhasapthami:

 

Sri Malayappa Swamy to take a celestial ride on Suryaprabha, Chinna Sesha, Garuda, Hanumantha, Chakrasnanam, Kalpavriksha, Sarvabhoopala and Chandraprabha Vahanams from dawn to dusk on a single day. 

 

The Slotted Sarva Darshan tokens stands cancelled on January 28. The devotees shall have darshan of Sri Venkateswara Swamy through Vaikuntham Queue Complex 2 on that day. 

 

VIP Break, all arjita sevas, privileged darshan including seniors citizens and physically handicapped are also cancelled.

 

The advance booking of accommodation also stands cancelled on January 27 and 28. Only CRO General counters will function on these two days for the allotment of accommodation. TB Counter remains closed on these two days.

 

Four lakhs of laddus are being kept as buffer stock apart from the daily stock of 3.5lakh laddus. 

 

Annaprasadam and beverages will be supplied to the devotees waiting in galleries, VQC 1 and 2, Narayanagiri Sheds, queue lines, mini Annaprasadam centres in Tirumala from morning to evening. One lakh buttermilk packets, two lakh beverages, 7-8 lakh Ready to Eat varieties including one lakh Pulihora, and other Annaprasadam menu will be served in galleries apart from the routine activity at MTVAC, PAC2, 4 and VQC.

 

Special arrangements of the distribution of water at 408 points apart from the existing 230 taps, 178 drums in galleries all along the mada streets.

 

130 odd students from Sri Venkateswara Balamandiram school run by TTD to present Aditya Hridayam during Suryaprabha Vahanam.

 

CEO SVBC Sri Shanmukh Kumar, FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, Temple DyEO Sri Ramesh Babu and other HoDs were present.

 

DEVOTEES WITHOUT FOLLOWING TIME SLOTS WILL BE ALLOWED THROUGH VQC 2

 

TTD has given Time slot tickets and tokens only to avoid long waiting hours by the pilgrims in compartments and queue lines while having the darshan of Sri Venkateswara Swamy.

 

But it is found, every day not less than 3000 devotees are not following the time slots and reporting many hours beyond their prescribed time. 

 

Henceforth, those pilgrims who are failing to report on given time will be allowed for darshan only through Vaikutham Queue Complex 2 along with the tokenless devotees only.

 

The devotees who booked tickets in on-line and SSD tokens in Tirupati should follow the given time to have a hassle-free darshan.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

మినీ బ్రహ్మోత్సవాలకు టిటిడి సన్నద్ధం

– జనవరి 28న రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్పస్వామి దర్శనం

– ఎస్ఎస్ డి టోకెన్లు, విఐపి బ్రేక్, అర్జిత సేవలు రద్దు

– జనవరి 27, 28వ తేదీల్లో వసతిగదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు

– నాలుగు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్

– గ్యాలరీల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు సరఫరా

– గ్యాలరీల్లో అవసరమైన ప్రాంతాల్లో షెల్టర్లు

– టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 25 జనవరి 2023: సూర్య జయంతి సందర్భంగా జనవరి 28న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నామని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తో కలిసి ఈవో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను మరింత అంకితభావంతో నిర్వహించి రథసప్తమి వేడుకలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లను తెలియజేశారు.

– శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు.

– జనవరి 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేయడమైనది. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు మరియు దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.

– జనవరి 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ రద్దు. వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజుల్లో సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రెండు రోజులు టిబి కౌంటర్ మూసివేస్తారు.

– రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు.

– తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు- 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు.

– వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతో పాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు లక్ష మజ్జిగ ప్యాకెట్లు, రెండు లక్షల పానీయాలు, ఒక లక్ష పులిహోర ప్యాకెట్లతోపాటు 7-8 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తారు.

– ప్రస్తుతం ఉన్న 230 కుళాయిలు, 178 డ్రమ్ములు కాకుండా మాడ వీధుల్లోని గ్యాలరీలలో 408 పాయింట్ల వద్ద తాగునీటి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

– టిటిడి శ్రీ వేంకటేశ్వర బాలమందిరం నుండి 130 మంది విద్యార్థులు సూర్యప్రభ వాహనంలో ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.

ఈ సమీక్షలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

దర్శన స్లాట్‌లను పాటించని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా అనుమతి

శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండటానికి టిటిడి టైమ్ స్లాట్ టిక్కెట్లు, టోకెన్లను జారీ చేస్తోంది. అయితే ప్రతిరోజూ దాదాపు 3000 మంది భక్తులు స్లాట్‌ సమయాన్ని అనుసరించడం లేదు. నిర్దేశించిన సమయం కంటే చాలా ఆలస్యంగా వస్తున్నారు.

ఇకపై నిర్ణీత సమయానికి రాని భక్తులను టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.