TTD GEARS UP FOR V-DAY, DWADASI AND NEW YEAR_ డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశికి విస్తృత‌ ఏర్పాట్లు

Tirumala, 21 December 2017: As this year end rush is coupled with auspicious days including Vaikunta Ekadasi on December 29, Dwadasi on 30 and New Year, TTD has geared up to meet the pilgrim rush and already began arrangements for the same.

Ø In view heavy year end rush, TTD has cancelled all arjitha sevas from December 28 till January 1.

Ø As the Vaikuntha Ekadasi is falling on Friday, with special Dhanurmasa Pujas and Abhisheka Kainkaryams, the Vaikuntha Dwara Darshanam is reduced by four hours.

Ø Darshan for VIPs will commence from 5.30AM onwards and for common devotee after 8am on December 29.

Ø As over one lakh pilgrims are expected to throng Tirumala during these occasions, TTD has made elaborate queue line arrangements for the devotees.

Ø For ministers and constitutional dignitaries, they will provided two rooms and not more than six tickets at Venkata kala Nilayam located in Sri Padmavathi Rest House area for self arrivals.

Ø For MLAs,MPs,MLCs six darshan tickets and a one room only will be allotted in Ramaraja Nilayam and Sita Nilayam rest houses.

Ø For All India service officials, four tickets and one room will be allotted at Sannidhanam and for other officials at Gambule guest house.

Ø No tickets for for any sevas will not be issued in JEO camp office at Gokualam from December 28th onwards. All officials will supervise the arrangements for devotee facilitation under the supervision of Tirumala JEO.

Ø As over a Lakh pilgrims are expected to throng on each of these days, TTD has urged the VIPs to co-operate with the management in the larger interests of the pilgrims.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశికి విస్తృత‌ ఏర్పాట్లు

డిసెంబరు 21, తిరుమల 2017: డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న వైకుంఠ ద్వాదశి, 2018, జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రానున్న నేపథ్యంలో టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది.

– డిసెంబరు 28న అర్ధరాత్రి తరువాత జీయర్‌స్వాముల ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరుస్తారు.

– డిసెంబరు 29వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు శుక్రవారం కావడంతో అభిషేకాది కైంకర్యాలు, ధనుర్మాస పూజల నిర్వహణ కారణంగా భక్తులకు సర్వదర్శనం సమయం 4 గంటల పాటు తగ్గింది.

– ఉదయం 5 నుంచి 5.30 గంటలమధ్య విఐపిలకు దర్శనం మొదలవుతుంది. ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్యలో సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

– శ్రీవారి దర్శనార్థం డిసెంబరు 27 నుంచి భక్తులు తిరుమలకు వస్తారు. కావున డిసెంబరు 28వ తేదీ నాడు సుమారు లక్ష మంది భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశముంది. భక్తులు 24 గంటల నుంచి 30 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది.

ప్రముఖులకు దర్శన, బస ఏర్పాట్లు :

– రాజ్యాంగపరమైన హోదాలో ఉన్నవారికి, ఇతర ప్రముఖులకు దర్శనం, వసతి కోసం టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది.

– మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాలోని ప్రముఖులు స్వయంగా వచ్చిన పక్షంలో తిరుమలలోని శ్రీ పద్మావతి విచారణ కార్యాలయ పరిధిలోని వెంకటకళా నిలయంలో ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, 2కు మించకుండా గదులు కేటాయిస్తారు.

– ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఏలకు రామరాజనిలయం, సీతానిలయంలో ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గది మంజూరు చేస్తారు.

– అఖిలభారత సర్వీసుల అధికారులకు సన్నిధానంలో, ఇతర ఉన్నతాధికారులకు గంబుల్‌ విశ్రాంతి గృహంలో నలుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గదిని కేటాయిస్తారు.

– డిసెంబరు 28వ తేదీ నుంచి జెఈవో క్యాంపు కార్యాలయమైన గోకులం భవనంలో ఎలాంటి టికెట్లు జారీ చేయరు. జెఈవో ఆధ్వర్యంలో అధికారులందరూ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు.

– లక్షకు పైబడి వేచియుండే సామాన్య భక్తుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖులు సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.