ONLINE BOOKING OF TTD CALENDARS AND DIARIES GETS ROUSING RECEPTION FROM PILGRIMS ACROSS COUNTRY_ టిటిడి క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు విశేష స్పందన

Tirumala, 21 December 2017: The attractive and Informative TTD calendars and diaries have received huge response from devotees present across the country as the bookings are pouring in from not only in Southern India but also from North, East and West states.

For the first time online booking for 12 sheet calendars and executive diaries were opened up by TTD on December 7th. The 12 sheet calendars are priced at ₹ 90 and diaries at ₹ 120 and remained as valuable gifts for new year.

The devotees can book them online on TTD website, ttdsevaonline.com under publications and pay through debit or credit cards. Delivery is made effectively by the Indian postal department.

So far 10,026 calendars and 5359 diaries have been booked online. The devotees from UP, MP, Bihar, Orissa, Jharkand, Kolkata, Goa, Andaman and Nicobar islands besides southern states were among those who booked on line.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు విశేష స్పందన

దేశం నలుమూలల నుంచి బుక్‌ చేసుకుంటున్న భక్తులు పోస్టల్‌ శాఖ ద్వారా నిర్ణీత వ్యవధిలో చేరిక

డిసెంబరు 21, తిరుమల 2017: టిటిడి క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఢిల్లీ, ముంబయి, విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి ప్రముఖ నగరాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు బుక్‌ చేసుకుంటున్నారు.

ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న 12 పేజీల క్యాలెండర్‌, డైరీని భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా మొదటిసారిగా ఆన్‌లైన్‌లో డిసెంబరు 7వ తేదీ నుంచి టిటిడి అందుబాటులో ఉంచింది. 12 పేజీల క్యాలెండర్‌ ధర రూ.90/-, పెద్ద డైరీ ధర రూ.120/-గా ఉంది. వీటిని నూతన సంవత్సరం కానుకగా తమ బంధువులకు, స్నేహితులకు పోస్టల్‌ ద్వారా పంపే అవకాశాన్ని టిటిడి కల్పించింది. భక్తులు ttdsevaonline.com వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్‌”ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. భక్తులు తమకు కావాల్సినన్ని క్యాలెండర్లు, డైరీలను బుక్‌ చేసుకోవచ్చు. పోస్టల్‌ శాఖ సిబ్బంది ఐదింటిని కలిపి ఒక ప్యాక్‌ చేసి పంపుతారు. నిర్ణీత వ్యవధిలో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు చేరేలా పోస్టల్‌ శాఖ చర్యలు చేపట్టింది. క్యాలెండర్‌, డైరీలను చేర్చినందుకు గాను ఎంఆర్‌పి ధరతోపాటు పోస్టల్‌ ఛార్జీలను భక్తులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు 12 పేజీల క్యాలెండర్లు 10,026, పెద్ద డైరీలు 5,359లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. వీటిలో 12 పేజీల క్యాలెండర్లు 3,900, పెద్ద డైరీలు 3,100లను పోస్టల్‌ శాఖ భక్తులకు చేరవేసింది. ఉత్తరాదిలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, గోవా, ఒడిశా, కోల్‌కతా, దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. టిటిడి క్యాలెండర్లు, డైరీలు పోస్టల్‌ శాఖ ద్వారా ఇంటి వద్దకే వచ్చి చేరుతుండడంతో ఎక్కువ మంది భక్తులు ఉత్సాహంగా బుక్‌ చేసుకుంటున్నారు. క్యాలెండర్లు, డైరీలను జవవరి నెల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.