TTD GETS Rs.2.38 CRORES IN MONTHLY E- AUCTION OF TONSURED HAIR_తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 2.38 కోట్లు

Tirumala ,01 March,2018 :The TTD has earned Rs.2.38 crore in the monthly e-auction of the tonsured hair contributed by the Srivari Devotees .

The e-auction is held on first thursday of every month under the direct supervision of TTD’s JEO ( Tirumala ) Sri K S Srinivasa Raju.Nearly 3500 kgs of five cateogries of tonsured hair were sold during todays e-auction .

The first category of (31 inches and above) and second group (16-30 inches), third group (10-15 Inches) and fourth (5-9 inches) and fifth (less than 5 “) were placed for auction.

TTD earned Rs.1.12 crore in sale of 500 kgs of First group of hair of the 10,000 kgs it put on sale platform at a rate of 22,494/- per kg.It got Rs 51.67 lakhs through sale of 300 kgs of the 41,400 kgs put up for sale at Rs 17,223/ per kg . It got Rs,69.61 lakhs by sale of all the 2400 kgs of the third category at rate of Rs.2833 per kg , TTD earned Rs.4.41 lakhs through sale of all the 300 kgs at Rs, 1195 per kg.

However the fifth variety of 22,300 kgs at Rs.36 per kg was not sold at all . It also could not sell any quantity of the 59,900 kgs of white hair priced at Rs. 5462 per kg.

The E-auctions were held on the platform of public sector enterptise – MSTC platform on a monthly basis.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI


తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 2.38 కోట్లు

తిరుమల, 2018 మార్చి 01కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ. 2.38 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 3500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 10,000 కిలోలను వేలానికి ఉంచగా 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.12 కోట్ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 41,400 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.51.67 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 2,400 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.69.61 లక్షల ఆదాయం లభించింది.

కిలో రూ.1,195/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 300 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.41 లక్షల ఆదాయం వచ్చింది.

కిలో రూ.36/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 22,300 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.5,462/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 5,900 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.