TTD GETS SRIVILLIPUTTUR GARLANDS FOR GARUDA SEVA_ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు
Tirumala, 3 Oct. 19: Andal Sri Godadevi garlands which are traditionally presented for Garuda Seva during the annual Brahmotsavams were brought from Srivilliputtur of Tamilnadu on Thursday.
The sacred garlands were first brought to Pedda Jeeyangar Mutt in Tirumala and after special pujas they were taken inside the Srivari Temple after a procession on the four-mada streets.
The garlands were received by TTD EO Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy infront of Srivari temple.
Speaking to media later, TTD EO said it was a traditional practice that the garlands adorned to Sri Godadevi at Srivilliputtur temple were brought for decorating the utsava idol of Sri Malayappaswamy on the Garuda seva day.
Srivari Temple Dy EO Sri Harindranath VSO Sri Manohar, Bokkasam in-charge Sri Gururaja Rao and others participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు
అక్టోబర్ 03, తిరుమల 2019: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయంగార్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవిమాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.శ్రీవారి ఆలయం ముందు గోదాదేవి మాలలకు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి స్వాగతం పలికారు.
అంతకుముందు అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ మనోహర్, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.