TTD GO SAMRAKSHANA CAMPAIGN SHOULD GO WORLDWIDE- SAYS KANCHI SEER _ టిటిడి గోసంర‌క్ష‌ణ ఉద్య‌మం విశ్వ‌వ్యాప్తం కావాలి – జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం ముగింపు స‌భ‌లో కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర్వ‌స్వ‌తి

Tirupati, 31 Oct. 21: The Seer of Kanchi Kamakoti peetham Sri Sri Sri Vijayendra Saraswathi blessed on Sunday that the Go Samrakshana campaign taken up by TTD should go, worldwide and a TTD boards Go Samrakshana yagam be a grand success.

 

In his mandala address at the valedictory of Go Maha Sammelan at the Mahati auditorium, the Kanchi pontiff urged TTD to extend the Go Samrakshana campaign underway presently from Kanyakumari to Kashmir up to Kathmandu in Nepal and appealed to everyone to make the Go Samrakshana into an apolitical movement,

 

The pontiff of Sringeri Sharada peetham Sri Sri Sri Vidhusekhar Bharati Swamy urged every Indian to support the campaign for Go Samrakshana.

 

Among others, Sri Gorushi swami Sri Datta Sharananda Maharaj, Udupi Pejawar mutt pontiff Sri Vishwrasanna Swamy, Sri Paripoornanandagiri Swami of Yerpedu Vyasasrama, Sri Radhakrishna ji Maharaj of Rajasthan, Sri Kamalananda Bharati Swamy of Sri Bhubaneswai peetham, and Sri Shilabhakti Raghava Swamy of ISCKON also shared their views on Go Samrakshana.

 

Earlier Sri Sri Sri Yadugiri Yatiraj Nrayaba Ramanuja Jeeyar Swamy, Sri Paramahamsa Prajnanandji Maharaj of Odhisa, Sri Gopalamani Chiutiyala of Uttarkhans Yuga Tulasi foundation Chairman and TTD former board member Sri Shiv Kumar also spoke.

 

Thereafter the TTD Chairman and TTD EO Felicitated the Peetadhipatis and pontiffs etc. with Shawl, Srivari portrait, Thirtha Prasadam and diaries/calendars.

 

TTD board ex officio member and Chandragiri legislator Dr Chevireddy Bhaskar Reddy were present,

 

SV Goshala Director Dr Harnath Reddy presented the vote of thanks speech to all participants organizers TTD officials, Srivari Sevakulu etc.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి గోసంర‌క్ష‌ణ ఉద్య‌మం విశ్వ‌వ్యాప్తం కావాలి

– జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం ముగింపు స‌భ‌లో కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర్వ‌స్వ‌తి

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 31: గోమాత సంర‌క్ష‌ణ కోసం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ములు ప్రారంభించిన ఉద్యమం విశ్వ‌వ్యాప్తం కావాల‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర్వ‌స్వ‌తి ఆకాంక్షించారు. శ్రీ‌వారి సంక‌ల్పంతో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్రారంభించిన గోసంర‌క్ష‌ణ య‌జ్ఞం త‌ప్ప‌క విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని ఆశీర్వ‌దించారు.

టిటిడి ఆధ్వ‌ర్యంలో తిరుప‌తి మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వ‌హించిన జాతీయ గో మ‌హాస‌మ్మేళ‌నం ముగింపు స‌భ‌ ఆదివారం రాత్రి జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. టిటిడి ప్రారంభించిన గోసంర‌క్ష‌ణ ఉద్యమం స‌మాజ జాగృతికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న ధార్మిక కార్య‌క్ర‌మాల‌ను నేపాల్‌లోని ఖాట్మండు వ‌ర‌కు వ్యాప్తి చేయాల‌న్నారు. ఇందుకు ఇదే త‌గిన స‌మ‌య‌మ‌ని, గోసంర‌క్ష‌ణ ద్వారా హిందూ ధ‌ర్మ వ్యాప్తికి టిటిడి స‌త్య సంక‌ల్పంతో మంచి నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఈ నిర్ణ‌యం భార‌తీయుల విశ్వాసాల ప‌రిర‌క్ష‌ణ‌, దేశ సంక్షేమానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు. గోవును సంర‌క్షించి గోసేవ చేసిన‌పుడే దేశం సుభిక్షంగా ఉంటుంద‌ని, రాజ‌కీయాల‌కు, వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌కు అతీతంగా దేశ‌ప్ర‌జ‌లంతా గోసంర‌క్ష‌ణ కోసం ఒకే తాటిమీద‌కు రావాల‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర్వ‌స్వ‌తి పిలుపునిచ్చారు. ప్ర‌పంచ భ‌విష్య‌త్తు గోసంర‌క్ష‌ణ మీదే ఆధార‌ప‌డి ఉంద‌ని, టిటిడి ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు త‌గిన గౌర‌వం ద‌క్కాల‌ని ఆయ‌న చెప్పారు.

శృంగేరి శార‌ద‌ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విధుశేఖ‌రభార‌తి స్వామి వీడియో సందేశం ద్వారా అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. గోసంర‌క్ష‌ణ‌తోనే హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ జ‌రుగుతుంద‌ని, ఇందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. భార‌తదేశంలో అనేక సంప్ర‌దాయాలు ఉన్నా, హిందూ ధ‌ర్మం గొప్ప‌ద‌ని, స‌నాత‌న హిందూ ధ‌ర్మానికి హాని జ‌రిగే ప‌రిస్థితి ఏర్ప‌డితే హిందువులంద‌రూ ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు. గోమాత‌ను జాతీయ‌ప్రాణిగా ప్ర‌క‌టించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌న్నారు.

గో సేవే భ‌గ‌వంతుడి సేవ : గోరుషి స్వామి శ్రీ‌ద‌త్త‌ శ‌ర‌నానంద‌మ‌హ‌రాజ్

గోవుల‌ను సేవిస్తే భ‌గ‌వంతుని సేవించిన‌ట్టేన‌ని, గోమాత వైశిష్ట్యాన్ని న‌లుదిశ‌లా వ్యాప్తి చేసేందుకు శ్రీ‌వారి అనుగ్ర‌హంతోనే తిరుప‌తిలో గోమ‌హాస‌మ్మేళ‌నం జ‌రుగుతోంద‌ని రాజ‌స్థాన్ ప‌త్‌మేడ‌కు చెందిన గోరుషి స్వామి శ్రీ‌ద‌త్త‌ శ‌ర‌నానంద‌మ‌హ‌రాజ్ పేర్కొన్నారు. రాజ‌స్థాన్‌లో నిత్యం క‌రువు కాట‌కాల వ‌ల్ల గోపోష‌ణ ఇబ్బందిగా ఉండేద‌ని, ఇందుకోస‌మే తాము 3 ల‌క్ష‌ల గోవుల‌ను ర‌క్షించి గోశాల నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. అప్ప‌టినుండి నిరంత‌రం గోసేవ‌లో నిమ‌గ్న‌మైన‌ట్టు తెలిపారు. ఆవుతో పాటు దూడ కూడా ప‌విత్ర‌మైంద‌న్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాల‌ని కోరేందుకు దేశంలోని ప్ర‌ముఖ మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు, స్వామీజీలు క‌ల‌వ‌డం శుభ‌సూచిక‌మ‌న్నారు. ఒడిశాలోనూ ప్ర‌తి మూడు జిల్లాల‌కు ఒక గోసంర‌క్ష‌ణ స‌మితి, గోసేవా సంస్థ ఏర్పాటుచేసి గోసేవ జ‌రుగుతోంద‌ని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు గోసేవ‌కు న‌డుం బిగించాల‌న్నారు. అడ‌వులు, వ‌నాల త‌ర‌హాలో గోసేవ‌కు గోభూమి ఉండాల‌ని, గోసంర‌క్ష‌ణ వేద‌ర‌క్ష‌ణ అని అన్నారు. అంద‌రూ మ‌న‌సా వాచా క‌ర్మ‌ణా గోసేవ చేయాల‌న్నారు.

ఉడిపి పెజావ‌ర్ మ‌ఠాధిప‌తి శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ స్వామీజీ

ఉడిపి పెజావ‌ర్ మ‌ఠాధిప‌తి శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ స్వామీజీ అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. భ‌గ‌వంతుని స్వ‌రూప‌మైన గోవును ర‌క్షించాల‌ని, శ్రీ‌వారిని ప్ర‌పంచానికి చూపించింది గోవు అని చెప్పారు. త‌ల్లి మూడు సంవ‌త్స‌రాలు పాలు ఇస్తే గోవు బ్ర‌తికినంత కాలం పాలు ఇస్తుంద‌ని చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాల‌ని, హిందూ స‌మాజంలో గో వ‌ధ‌, మ‌త మార్పిడుల‌ను దేశం మొత్తం నిషేధించాల‌న్నారు.

ఏర్పేడు వ్యాసాశ్ర‌మానికి చెందిన శ్రీ ప‌రిపూర్ణానంద‌గిరి స్వామి మాట్లాడుతూ గోసంర‌క్ష‌ణ‌కు టిటిడి చేప‌ట్టిన గోమ‌హాస‌మ్మేళ‌నం దేశానికి మార్గ‌ద‌ర్శ‌నం అవుతుంద‌న్నారు. గోసంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క భార‌తీయుడి బాధ్య‌త‌ని చెప్పారు.

అనంత‌రం రాజ‌స్థాన్‌కు చెందిన శ్రీ రాధాకృష్ణ‌జీ మ‌హ‌రాజ్ మాట్లాడుతూ గోపూజ ముక్కోటి దేవ‌త‌ల పూజ‌తో స‌మాన‌మ‌ని, గోమాత విశ్వానికే త‌ల్లిలాంటిద‌ని చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ భువ‌నేశ్వ‌రి పీఠాధిప‌తి శ్రీ క‌మ‌లానంద‌భార‌తీ స్వామిజి ఉప‌న్య‌సిస్తూ టిటిడి చేప‌ట్టిన గోసంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు. మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు, స్వామీజీ స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో హిందూ ధ‌ర్మాన్ని మ‌రింత‌గా వ్యాప్తి చేయాల‌ని కోరారు.

ఇస్కాన్ సంస్థకు చెందిన శ్రీ శీల‌భ‌క్తి రాఘ‌వ స్వామి మాట్లాడుతూ గోసంర‌క్ష‌ణ వ‌ల్ల దేశం సుభిక్షంగా ఉంటుంద‌ని చెప్పారు. గోమాత విశ్వ‌మాత అన్నారు.

అంత‌కుముందు య‌దుగిరి య‌తిరాజ మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ య‌దుగిరి య‌తిరాజ నారాయ‌ణ రామానుజ జీయ‌ర్‌స్వామిజి, ఒడిశా శ్రీ ప‌ర‌మ‌హంస ప్ర‌జ్ఞానంద‌జి మ‌హ‌రాజ్‌, ఉత్త‌రాఖండ్‌కు చెందిన శ్రీ గోపాల‌మ‌ణి నౌతియాల్‌, యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్ ప్ర‌సంగించారు.

అనంత‌రం పీఠాధిప‌తులు, మ‌ఠాధిప‌తులు, స్వామీజీల‌ను టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి చిత్ర‌ప‌టం, తీర్థ‌ప్ర‌సాదాలు, డైరీ, క్యాలెండ‌ర్ల‌ను అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యులు, చంద్ర‌గిరి శాస‌న‌స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి వంద‌న స‌మ‌ర్ప‌ణ చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.