TTD INTRODUCES ONE DAY DONATION SCHEME IN ANNAPRASADAM_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులో ఒక రోజు విరాళ పథకం
Tirumala, 12 June 2018: The temple administration of TTD has introduced one day donation scheme in SV Annaprasadam.
Elaborating on the scheme, Tirumala JEO Sri KS Sreenivasa Raju told media on Tuesday that the donors can contribute for one day meals or even bear the expenditure separately for morning breakfast, lunch and dinner also, he added.
For one entire day, the donation amount is Rs.26lakhs while for breakfast it is Rs.6lakhs and for lunch and dinner it is Rs.10lakhs each for the entire scheme. The privileges will be extended to the donors as per the norms prescribed for existing donation Trusts and scheme.
If is for one whole, the donor will get the privilege equivalent on par with the donors contributing between Rs.10lakhs to one crore. While those contributing for lunch and dinner will get the privileges equal to donations made between Rs.10lakhs and below one crore. For those who are bearing cost of breakfast will enjoy the privileges of donors who contribute Rs.5lakhs to Rs.10lakhs.
Apart from this, the TTD will also give an opportunity to one person to render service in Annaprasadam and their names will also be displayed on the screen in Annaprasadam Complex, the JEO added.
Special Officer Annaprasadam Sri. S Venugopal, PRO and Donor Cell In-charge DyEO Dr T Ravi were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులో ఒక రోజు విరాళ పథకం
జూన్ 12, తిరుమల 2018: శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టులో ఒక రోజు విరాళ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు జెఈవో తెలిపారు. ఒక రోజు ఖర్చు లేదా ఒక పూటకు అయ్యే ఖర్చును దాతలు విరాళంగా అందించవచ్చన్నారు. రూ.26 లక్షలు అందిస్తే దాతల పేరిట ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వితరణ చేస్తామన్నారు. అదేవిధంగా, ఉదయం అల్పాహారానికి రూ.6 లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ.10 లక్షలు, రాత్రి భోజనానికి రూ.10 లక్షలను దాతలు అందించవచ్చని చెప్పారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దాతలకు ఒక రోజు సేవ చేసే అవకాశం కల్పిస్తామని, వారి పేర్లను ప్రదర్శిస్తామని తెలిపారు. ట్రస్టు నిబంధనలకు అనుగుణంగా దాతలకు టిటిడి ప్రయోజనాలు కల్పిస్తుందన్నారు. భక్తులు విశేషంగా భావించే రోజుల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జెఈవో కోరారు.
అంతకుముందు జరిగిన సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ బాలాజి తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.