SV MUSEUM TO GET A FACE LIFT SOON-JEO_ ఎస్వీ మ్యూజియాన్ని మరింత ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirumala, 12 June 2018: The Sri Venkateswara museum in Tirumala will get a new look soon to attract more number of devotees, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
Speaking to media persons after the senior officers review meeting at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the JEO said, the lighting will be improved soon in the museum to give it a more attractive look.
He also said, a Auditorium with 150-200seating capacity will also be constructed in the premises. We are contemplating to show a 20-minute documentary on Lord Venkateswara, temple, Tirumala and it’s environs for better information of the pilgrim public. So when the devotee enters into the sanctum he could be able to have darshan of Lord with more clarity, he felt.
Earlier during the coordination meeting, the JEO reviewed on various pending works related to different departments and instructed the concerned to complete the works within the stipulated time.
Later the JEO also complimented the Vigilance and Security wing of TTD for their extraordinary services in manning pilgrim crowd during summer vacation. “Unprecedented turn out of pilgrims has been witnessed this year and our Vigilance and Security sleuths did a great job”, he complimented
CE Sri Chandrasekhar Reddy, CVSO Incharge Sri Venkata Siva Kumar Reddy, SE 2 Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy, DyEOs Sri Harindranath, Sri Balaji, Sri Vijayasaradhi, Sri Sreedhar and other senior officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ మ్యూజియాన్ని మరింత ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
జూన్ 12, తిరుమల 2018: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని మరింత ఎక్కువమంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం పలు విభాగాల అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.
సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని సందర్శనీయ ప్రాంతాలను సందర్శించేలా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఎస్వీ మ్యూజియాన్ని ప్రస్తుతం రోజుకు 4 వేల మంది భక్తులు సందర్శిస్తున్నారని తెలిపారు. టిటిడి ఈవో ఆదేశాల మేరకు ఆడిటోరియంలో మరమ్మతులను పూర్తిచేసి దాదాపు 200 మంది భక్తులు కూర్చొని తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, శ్రీవారి వైభవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేపడతున్నామని వివరించారు. గత అనుభవాల ప్రకారం జులై 5 వరకు తిరుమలలో రద్దీ కొనసాగుతుందని, భక్తుల సౌకర్యార్థం నిర్దేశించిన మేరకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. తిరుమల, తిరుపతిలో కలిపి మంగళ, బుధ, గురువారాల్లో 17 వేల టోకెన్లు, సోమ, శుక్రవారాల్లో 20 వేల టోకెన్లు, శని, ఆదివారాల్లో 30 వేల టోకెన్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. క్రమేపీ టోకెన్ల సంఖ్యను పెంచుతామన్నారు.
తిరుమలలో ఏనుగులు సంచరించకుండా ముందుజాగ్రత్త చర్యలు : జెఈవో
తిరుమలలోని శ్రీవారి పాదాలు ప్రాంతంలో ఏనుగులు సంచరించకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని, భక్తులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో మంగళవారం జెఈవో మీడియాతో మాట్లాడారు.
వారం రోజుల ముందు ఈ ప్రాంతానికి ఏనుగులు వచ్చాయని, రెండు రోజుల తరువాత వెళ్లిపోయాయని తెలియజేశారు. సోమవారం తిరిగి ఏనుగులు వచ్చాయని తెలిసిందని, వెంటనే రోడ్డును మూసివేసి అటవీ సిబ్బందిని కాపలా ఉంచామని వివరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా టపాసులను, డ్రమ్స్‌ను అందుబాటులో ఉంచుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏనుగుల జాడ లేదని, అడవిలోకి వెళ్లిపోయాయని వెల్లడించారు. డిఎఫ్‌వో శ్రీఫణికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో అటవీ అధికారుల బృందం అడవిలో పర్యటించిందని, కొత్తగా ఏనుగులు వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని తెలియజేశారు. తిరుమలలో భక్తులు సంచరించే ప్రాంతాల్లోకి ఏనుగులు రాకుండా కందకాలు తవ్వేందుకు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.