TTD INVITES ADMISSIONS FOR EVENING CLASSES IN ITS FINE ARTS COLLEGE

Tirupati, 22 June 2017: The SV College of Dance and Music has invited interested candidates to opt for evening classes in its nine fine arts courses.

The courses included vocal, violin, mridangam, Bharatnatyam, Kuchipudi, flute, Veena, ghatam and Harikatha. For those who are aspiring for admission into four year certificate course should be aged between 11 years and 60 years with fifth standard qualification. They should pay a fee of Rs. 1500 per year. While for those who are opting for two year Diploma course should be aged between 15 years and 60 years with minimum qualification of fifth standard and should pay a fee of Rs.1700 per year. While for Pravesika, the age should be between eight years to 60 with minimum education of second standard and fee of Rs.1000 per annum for two years.

Interested candidates can get the application for Rs.25 and should submit the filled application in the college on July 7 before 4pm. Interviews will be conducted for various courses from July 11 to 15 and the classes will commence from July 18by 5:30pm. The second spell of admissions will be on July 25.

For more information contact: 0877 2264597 between 11am to 4pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సాయంత్రం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానము

తిరుపతి, 2017 జూన్‌ 22: తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న సాయంత్రం కళాశాలలోని వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. కళాశాలలోని 9 విభాగాలలో గాత్రము, వీణ, వయొలిన్‌, వేణువు, హరికథ, భరత నాట్యము, కూచిపూడి నృత్యము, మృదంగము, ఘటము కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందులో నాలుగు సంవత్సరాల సర్టిఫిట్‌ కోర్సుకు 11 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకోసం ఒక సంవత్సరానికి రూ.1500/- ఫీజు చెల్లించాలి. రెండు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా కోర్సుకు 15 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందుకోసం ఒక సంవత్సరానికి రూ.1700/- ఫీజు చెల్లించాలి. రెండు సంవత్సరాల కళాప్రవేశిక కోర్సుకు 8 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, 2వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనికోసం ఒక సంవత్సరానికి రూ.1000/- ఫీజు చెల్లించాలి.

ఆశక్తి గలవారు రూ.25/- చెల్లించి దరఖాస్తులను పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను జూలై 7వ తేదీ సాయంత్రం 4.00 గంటల లోపల కళాశాలలో అందజేయల్సి ఉంటుంది. ఈ కోర్సులకు జూలై 11 నుండి 15 వ తేదీ వరకు ఇంటర్యూలు, అడ్మిషన్లు నిర్వహిస్తారు. జూలై 18 నుండి సాయంత్రం 5.30 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయ.

రెండవ విడత అడ్మిషన్లు జూలై 25వ తేదీ నుండి ప్రారంభమవుతాయ. ఇతర వివరాలకు ప్రిన్సిపాల్‌, ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల కార్యాలయము, బాలాజీ కాలనీ, తిరుపతి-517502. ఫోన్‌ నెం.0877-2264597లో ఉదయం 11.00 నుండి సాయంత్రం 4.00 గంటలలోపు సంప్రదించాలి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.